Table of Contents
Guntur Kaaram Maheshbabu Sankranthi సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో చాలా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, తొలుత ఈ సినిమా కోసం పూజా హెగ్దేని ఎంపిక చేస్తే, ఆ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చింది.
శ్రీలీలకి సెకెండ్ హీరోయిన్ నుంచి మెయిన్ హీరోయిన్‌గా ప్రమోషన్ లభిస్తే, శ్రీలీల స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.
సంగీత దర్శకుడి విషయంలో గందరగోళం చూశాం. ఆ తర్వాత, ‘అంతా తూచ్..’ అన్నారనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, సినిమాటోగ్రాఫర్ కూడా మారాడు. యాక్షన్ కొరియోగ్రాఫర్‌నీ మార్చారు. ఇలా చాలా మార్పులు జరిగాయి, జరుగుతూనే వున్నాయి.
Guntur Kaaram Maheshbabu Sankranthi.. డౌటానుమానాలు వున్నాయ్ మరి.!
ఇంత గందరగోళం నడుమ, ‘గుంటూరు కారం’ సంక్రాంతికి వస్తుందా.? రాదా.? అన్న డౌటానుమానాలు తెరపైకి రావడం సహజమే.
కాగా, మహేష్ తాజాగా మీడియా ముందుకొచ్చాడు. అదీ ఓ బిగ్-సి సంస్థ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న దరిమిలా, ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ అది.
ఏదో ప్రశ్నలడిగేయాలి కాబట్టి.. అన్న కక్కుర్తితో కొందరు ఎర్నలిస్టులు (నిజమే, వీళ్ళు జర్నలిస్టులు కాదు.. జస్ట్ ఎర్నలిస్టులంతే) సంధించే అర్థం పర్థం లేని ప్రశ్నలకు మహేష్ సమాధానాలు ఇస్తోంటే, కౌంటర్ ఎటాక్.. అన్నట్లే వుంది.!
Mudra369
ఈ సందర్భంగా మహేష్ ముందరకి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా విషయమై కొన్ని ప్రశ్నలు మీడియా నుంచి వచ్చాయ్.
అలాంటి ప్రశ్నలొస్తాయని మహేష్ కూడా ముందే ఊహించి వుంటాడు. పక్కాగా ప్రిపేరయ్యాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ప్రశ్నకూ సమాధానాన్ని ఆచి తూచి చెప్పాడు. ఈ క్రమంలో కొన్ని సెటైర్లూ వేశాడు మహేష్.
ఆ విషయాలు మీకెందుకు.?
మహేష్ విదేశీ పర్యటనల గురించి ఓ మీడియా ప్రతినిథి అడిగితే, ‘నా టూర్స్ గురించి మీరెందుకు బాధపడిపోతున్నారు.?’ అంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు మహేష్.
‘నేను వెళుతున్న విషయాల్ని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నాను కదా.. అలా చెప్పడం వల్లే మీకు తెలుస్తోంది కదా..’ అంటూ మహేష్ వ్యాఖ్యానించడం గమనార్మం.

‘గుంటూరు కారం’ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మహేష్ స్పష్టం చేసేశాడు. సో, మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీ.
మీడియాని ఫేస్ చేసే క్రమంలో మహేష్ ఇచ్చిన ఒక్కో సమాధానం.. వీర లెవల్‌లో ట్రెండింగ్ అవుతోంది. లేకపోతే, షూటింగ్ గ్యాప్ ఎప్పుడొస్తుంది.. విదేశీ పర్యటనలకు ఏ సమయంలో వెళ్ళాలి.? ఇవన్నీ మహేష్‌కి తెలియదా.?
టైము.. టైమింగు.. ఈ విషయంలో మహేష్‌బాబు వేరే లెవల్.. అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు.
పసి పిల్లల గుండె శస్త్ర చికిత్సల కోసం..
అన్నట్టు, కమర్షియల్ యాడ్స్ ద్వారా వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని, పసి పిల్లల గుండె శస్త్ర చికిత్సల కోసం వెచ్చిస్తుండడం ఆనందంగా వుందన్నాడు మహేష్.
Also Read: చిట్టీ.! నువ్వొస్తానంటే వాళ్ళే వద్దంటున్నారా.?
మొబైల్ పోన్ వినియోగంలో తానూ ఒకింత ‘అతి’ చేస్తుంటాననీ, అది తగ్గించుకోవాల్సి వుందని మహేష్ చెప్పుకొచ్చాడండోయ్.!
రాజమౌళి సినిమాకి ఇంకా టైమ్ వుందనీ, సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు చెబుతానన్నాడు మహేష్.