Guntur Kaaram Meenakshi Chaudhary.. ఏంటో.. పూటకో గాసిప్ వస్తోంది ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.
ముందేమో, పూజా హెగ్దేని (Pooja Hegde) హీరోయిన్‌గా తీసుకున్నారు.! అదనంగా శ్రీలీలనీ (Sreeleela) తీసుకున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైంది.. బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయ్.!
మొన్నీమధ్యనే సంగీత దర్శకుడు తమన్‌ని (Music Director SS Thaman) తప్పించారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అంతలోనే, తూచ్ అనేశారు.
Guntur Kaaram Meenakshi Chaudhary.. సంయుక్త కాదా.? మీనాక్షిని దించుతున్నారా.?
అనివార్య కారణాల వల్ల పూజా హెగ్దే (Pooja Hegde) ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకుందనీ, దాంతో శ్రీలీల (Sree Leela) మెయిన్ హీరోయిన్ అయ్యిందనేది నిన్న మొన్నటిదాకా వినిపించిన గాసిప్స్ సారాంశం.

కాదు కాదు, మెయిన్ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon).. శ్రీలీల (Sree Leela) కి ఇంతకు ముందు ఇచ్చిన రోల్ మాత్రమే.. అని కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి.
Also Read: Apsara Rani.. శివి.! ఆర్జీవీ.! సరిపోయారు ఇద్దరూ.!
ఇప్పుడైతే, కొత్తగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పేరు వినిపిస్తోంది. ఈ బ్యూటీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

‘ఖిలాడీ’ (Khiladi) సినిమాలో రవితేజ (Raviteja) సరసన ఆడిపాడింది మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).! ఇంతకీ, ‘గుంటూరు కారం’లో మీనాక్షి పేరు ఖాయమైనట్టేనా.?
ప్చ్.. ఏమో, పూటకో కొత్త గాసిప్ తెరపైకొస్తున్న దరిమిలా, ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram) విషయంలో టీమ్ అధికారికంగా స్పందించేదాకా.. దేన్నీ నమ్మలేం.

ఒక్కటి మాత్రం నిజం. ‘గుంటూరు కారం’ సినిమా ప్రారంభించిన ముహూర్తం బాగోలేదేమో.. వరుస వివాదాలు సినిమాని వెంటాడుతున్నాయ్.!
అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంబినేషన్.. కానీ, ఇదిగో ఇలా గందరగోళంలో పడిపోయింది. ఈ సినిమా పూర్తయిపోతే, రాజమౌళితో చేయబోయే సినిమా కోసం సన్నద్ధమవ్వాల్సి వుంటుంది మహేష్.