Gunturu Kaaram Mahesh Trivikram.. గురూజీకి ఏమయ్యింది.? ఔను కదా, గురూజీకి అసలేమయ్యింది.? తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని మాటల మాంత్రికుడనీ, గురూజీ అనీ అంటుంటాం.!
అవును మరి.! త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో డైలాగులు ఆ రేంజ్‌లో వుంటాయ్.! కానీ, ‘త్రీడీ బీడీ’ అంటూ, మహేష్‌బాబు కొత్త సినిమా ‘గుంటూరు కారం’ కోసం రాసిన డైలాగే.. అస్సలు బాలేదు.!
‘ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడిందా.?’ అంటాడు ఈ సినిమాలో హీరో మహేష్.! ఇది త్రివిక్రమ్ మార్కు డైలాగ్ అని మనం సరిపెట్టుకోవాలి.
Gunturu Kaaram Mahesh Trivikram.. టైటిల్.. థియేటర్లలో విడుదల.!
ఈ మధ్య ఇదో కొత్త ట్రెండు.! మొన్నీమధ్యనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్‌నీ, ఆ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌నీ సినిమా థియేటర్‌లో రివీల్ చేశారు.

తాజాగా, మహేష్ – త్రివిక్రమ్ కాంబో సినిమా టైటిల్‌నీ అలాగే విడుదల చేశారు. ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram) సినిమా టైటిల్.!
అబ్బే, అస్సలు ఘాటుగా లేదు టైటిల్. ఈ మాట స్వయానా సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Maheshbabu) అభిమానులే చెబుతున్నారు.
ఒకే ఒక్క చొక్కాతో..
‘గుంటూరు కారం’సినిమా టైటిల్‌ని రివీల్ చేసే క్రమంలో.. ఒకే ఒక్క చొక్కాని వాడుతూ వచ్చారు. అదే చొక్కాని.. సినిమాలోనూ వాడేశారు.
ఓ ఫ్రేమ్‌లో ఇంకో చొక్కా ఏదో కనిపించిందిగానీ.. ప్చ్.. మహేష్‌ని ఎలివేట్ చేయాల్సిన స్థాయిలో అయితే ఎలివేట్ చేయలేకపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

టాలీవుడ్‌కి సంబంధించినంతవరకు అందరూ ఎదురు చూస్తోన్న మూవీస్‌లో ఈ ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram) కూడా ఒకటి.
Also Read: Harish Shankar.. హరీషోక్తి.! డబ్బింగూ లేదు.. రీ‘మేకూ’ కాదు.!
అలాంటప్పుడు.. ఎంత హంగామా వుండాలి.? ప్చ్.. ఆ హంగామా అయితే వుండాల్సిన స్థాయిలో లేకుండా పోయింది.
సినిమాపై మొదటి నుంచీ విపరీతమైన నెగెటివిటీ రన్ అవుతోంది.! దాన్ని ఈ ‘టైటిల్’ రివీల్‌తో మరింత కొనసాగించారనే అనుకోవాలేమో.!