Home » Hansika Divorced: ఔను.! వాళ్ళిద్దరూ విడిపోయారు.!

Hansika Divorced: ఔను.! వాళ్ళిద్దరూ విడిపోయారు.!

by hellomudra
0 comments
Hansika Motwani

Hansika Motwani Divorced.. ప్రేమ, పెళ్ళి, విడాకులు.. ఇదంతా ఓ ప్రసహనంగా మారిపోయింది.!

ఔను, సాధారణ ప్రజానీకంలో కూడా ఈ ప్రేమ, పెళ్ళి.. వీటితోపాటే విడాకులు.. ఇదంతా ఓ సర్వసాధారణ వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం.

సెలబ్రిటీలు కాబట్టి, సినీ ప్రముఖుల విషయంలో ఈ ప్రేమ, పెళ్ళి అలానే విడాకుల వ్యవహారం.. ఒకింత హాట్ టాపిక్ అవుతుంటుంది.

కొన్నేళ్ళ క్రితం హన్సిక, ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఓ ఓటీటీ సంస్థ, హన్సిక వివాహ వేడుక వ్యవహారాన్ని ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించింది కూడా.

Hansika Motwani Divorced.. పెళ్ళి పెటాకులయ్యింది..

అప్పట్లో హన్సిక పెళ్ళి ఓ హాట్ టాపిక్. వరుడుకి ఆల్రెడీ పెళ్ళయ్యిందనీ, హన్సిక కారణంగానే అతను తన భార్యకి దూరమయ్యాడనీ ప్రచారం జరిగింది.

హన్సిక మాత్రం, తాను ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నాననీ, అతనంటే తనకు చాలా గౌరవమనీ, అతనికి తానంటే చాలా ఇష్టమనీ చెప్పుకొచ్చింది.

కట్ చేస్తే, పెళ్ళయిన ఆర్నెళ్ళకే.. ఇద్దరి మధ్యా మనస్పర్ధలంటూ గుసగుసలు వినిపించాయి. ఇదిగో విడాకులు.. అదిగో మళ్ళీ పెళ్ళి.. అంటూ హన్సిక చుట్టూ చాలా గాసిప్స్ కూడా పుట్టుకొచ్చాయి.

Hansika Motwani
Hansika Motwani

చిత్రంగా, తన మీద వచ్చిన గాసిప్స్‌ని ఏనాడూ ఖండించలేదు హన్సిక. దాంతో, నిప్పు లేకుండా పొగ రాదు.. విడాకుల వ్యవహారం నిజమేనని అంతా అనుకున్నారు.

ఔను, అదే నిజమని తాజాగా తేలింది. హన్సిక, తన భర్త నుండి విడాకులు తీసుకుంది. ఇద్దరూ మ్యూచువల్‌గా విడాకులు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక మోత్వానీ. బాలీవుడ్‌లో మాత్రం బాల నటిగా హన్సిక కెరీర్ స్టార్ట్ అయ్యింది.

ఇంతకీ, హన్సిక విడాకులకు కారణమేంటి.? మళ్ళీ పెళ్ళికి హన్సిక సిద్ధమవుతోందా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత, ఇటీవలే రాజ్ డీకే‌ని పెళ్ళాడిన సంగతి తెలిసిందే. చెప్పుకుంటూ పోతే, ఈ తరహా వ్యవహారాలు సినీ పరిశ్రమలో చాలానే కనిపిస్తాయ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group