Table of Contents
HanuMan Movie Sky High.. సూపర్ మ్యాన్ తెలుసు.. బ్యాట్ మ్యాన్ తెలుసు.! శక్తి మాన్ కూడా తెలుసు.! ఈ హను మ్యాన్ ఎవరు.?
హను మ్యాన్ ఏంటి.? హనుమాన్.! హనుమంతుడు.! అతి బలవంతుడు.! హనుమంతుడంటే చిరంజీవి.!
ఔను కదా, హనుమంతుడి ముందర కుప్పి గంతులేంటి.? ‘హనుమాన్’ని కాస్తా, ‘హను మ్యాన్’గా మార్చేయడమేంటి.? బ్యాడ్, టూ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్.!
ఇదీ, హనుమాన్ సినిమా ముందర చాలా మందికి కలిగిన చాలా చాలా డౌటానుమానాలు.! తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది ‘హనుమ్యాన్’.!
హను మ్యాన్.. కలిపితే, హనుమాన్.! ఇదీ అసలు సంగతి.! ఇంతకీ, సినిమా ఎలా వుంది.? అది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.!
ప్రస్తుతానికైతే, హైద్రాబాద్‌లోని ప్రసాద్స్ పీసీఎక్స్ బిగ్ స్క్రీన్ మీద ‘హనుమాన్’ సినిమా అనుభవం గురించి మాత్రమే ప్రస్తావించుకుందాం.!
HanuMan Movie Sky High.. పెద్ద తెరపై.. చాలా పెద్ద హీరో.!
సంక్రాంతి పండక్కి సినిమా చూడటం అనేది చిన్నప్పటినుంచీ అలవాటు.! పెద్దయ్యాక కూడా ఆ అలవాటు కొనసాగింది. పిల్లలూ టెన్త్ దాటి, ఇంటర్మీడియట్కి వచ్చేశారు.!
‘హనుమాన్’ సినిమా చూద్దామని అడిగితే, అదేంట్రా ‘గుంటూరు కారం’ గురించి కదా గోల చెయ్యాలి.? అని నా వైపు నుంచి ఎదురు ప్రశ్న దూసుకెళ్ళింది.!
కాదు కాదు, ‘హనుమాన్’ చూడాలన్నారు.! సర్లే అని థియేటర్‌కి వెళితే, ‘నో టిక్కెట్స్’. ప్రసాద్స్‌లో వేరే స్క్రీన్స్‌లో టిక్కెట్లు వున్నా, ‘బిగ్ స్క్రీన్’ మీదనే చూద్దామన్నారు.!
ఎవడో ‘హనుమాన్’ సినిమాకి థియేటర్లు దొరక్కుండా తెరవెనుకాల నానా రకాల కుట్రలూ చేశాడట.!
పెద్ద సినిమా, చిన్న సినిమా.. అంటూ వికారపు వ్యాఖ్యలు కూడా చేశాడట ఆ ‘మనసు’లేని సినీ ‘రాజు’ ఎవడో.!
అసలు సినిమా అంటే ఇదిరా.. హీరో అంటే ‘హనుమ’రా.! అని గూబ గుయ్యిమనిపిచేలా రెండు పీకి చెప్పాలని వుంది వాడికి.!
Mudra369
ఓ రెండ్రోజుల గ్యాప్.. ఈసారి ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుని, హడావిడిగా సినిమాకి వెళ్లాం.. కుటుంబ సమేతంగా.!
ఇరవై నిమిషాల లేటు.. సాంకేతిక పరమైన సమస్య అట.! అది కాస్తా, అరగంటకు పొడిగించబడింది.! చాన్నాళ్ళ క్రితం ఐమ్యాక్స్ వెర్షన్లో బిగ్ స్క్రీన్ మీద సినిమా చూశా.!
పీసీఎక్స్ ఫార్మాట్‌కి మారాక, ఇదే మళ్ళీ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడటం.! ప్రకటనలు.. వాటితోనే, కొత్త అనుభూతి.!
ఆ తర్వాత సినిమా షురూ అయ్యింది.! అలా పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని కొండ కోయల్లోంచి వెళుతూ చూపించేసరికి, కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయాం.!
తెరపై తేజ సజ్జ ఏవేవో చేస్తున్నాడు. నటీనటులంతా తమ పని తాము చేసుకుపోతున్నారు. కెమెరా పనితనం బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే.!
ఇంటర్వెల్ వచ్చింది. సినిమా ఫర్లేదంతే.. అనుకున్నాను.! ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
హనుమాన్ విశ్వరూపం.!
వరలక్ష్మి శరత్ కుమార్ ఒక్కసారిగా యాక్షన్ మోడ్‌లోకి రావడం.. ఓ గడ్డపు వ్యక్తి, అప్పటికప్పుడు హీరో పాత్రలోకి మారిపోవడం.. ఇదంతా ఈసారి నిజంగానే వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళింది.
సినిమా పూర్తయ్యింది.! అప్పుడే పూర్తయిపోయిందా.? ‘జై హనుమాన్’ అంటూ థియేటర్లో నినాదాలు.! ఆ నినాదాలు చేస్తున్న చిన్న పిల్లల్ని అదుపు చేస్తున్న పెద్దవాళ్ళు.

వృద్ధాప్యంలో వున్నోళ్ళని థియేటర్లలో చూడటం ఈ మధ్యకాలంలో చాలా చాలా అరుదు. ‘హనుమాన్’ సినిమా థియేటర్లో వృద్ధులూ ‘జై హనుమాన్’ అంటూ నినదించారు.
‘బాగోదమ్మా.. బాగోదు నాన్నా’ అంటూ పెద్దవాళ్ళని అదుపు చేస్తున్న పిల్లలు.! ఒకింత చిత్రంగా అనిపించింది అక్కడి పరిస్థితి.
బిగ్ స్క్రీన్ సరిపోలేదు వర్మా.!
థియేటర్ నుంచి బయటకు వచ్చాక, నాకైతే, ‘బిగ్ స్క్రీన్ సరిపోలేదు వర్మా..’ అనాలనిపింది.. దర్శకుడ్ని ఉద్దేశించి. మనసులో అనేసుకున్నాను కూడా.! ఇదిగో, ఇక్కడ రాసేస్తున్నాను.! ఇది ప్రశాంత్ వర్మకి చేరుతుందో లేదో.!
ఎన్నాళ్ళయ్యింది ఇలాంటి సినిమా చూసి.! సినిమా కాదిది.. దీన్ని ఇంకోటేదో అనాలి.! చివర్లో ఆకాశమంత ఎత్తున్న హనుమంతుడు.. బిగ్ స్క్రీన్ ఇంకో వంద రెట్లు వుంటే బావుండేదనిపించింది.!
నిజమే, రెండు కళ్ళూ చాలలేదు.! ఇలాంటి అనుభూతి ఇంతకు ముందు ఏ సినిమా చూసినప్పుడూ కలగలేదు.!
HanuMan Movie Sky High.. పెద్ద హీరో ఎవరు.?
హనుమంతుడి కంటే పెద్ద హీరో ఎవరున్నారు.? అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో వ్యాఖ్యానించాడు. నిజమే కదా.!
ఎవడో ‘హనుమాన్’ సినిమాకి థియేటర్లు దొరక్కుండా తెరవెనుకాల నానా రకాల కుట్రలూ చేశాడట.!
పెద్ద సినిమా, చిన్న సినిమా.. అంటూ వికారపు వ్యాఖ్యలు కూడా చేశాడట ఆ ‘మనసు’లేని సినీ ‘రాజు’ ఎవడో.!
అసలు సినిమా అంటే ఇదిరా.. హీరో అంటే ‘హనుమ’రా.! అని గూబ గుయ్యిమనిపిచేలా రెండు పీకి చెప్పాలని వుంది వాడికి.!
చివరగా ఓ చిన్న మాట.! థ్యాంక్స్ ప్రశాంత్ వర్మా.! అన్నట్టు, దీనికి కొనసాగింపు సినిమా ‘జై హనుమాన్’ అంట కదా.!
– yeSBee