నువ్వేమన్నా చిరంజీవిననుకుంటున్నావేంట్రా.? అన్న ప్రశ్న ఒక్కటి చాలు, చిరంజీవి రేంజ్ ఏంటో చెప్పడానికి. చిరంజీవి (Mega Star Chiranjeevi) స్టార్డమ్ సంపాదించుకున్నాక.. ఆయన మాత్రమే ‘హీరో’లా కనిపించేవారు చాలామంది సినీ ప్రేక్షకులకి. అసలు చిరంజీవిని అభిమానించని సినీ ప్రేక్షకుడెవరుంటారు.? అన్న చర్చ అప్పట్లో జరిగేది. దటీజ్ చిరంజీవి.
సుప్రీం హీరో.. మెగాస్టార్.. ఇలా చిరంజీవి పేరు ముందు వచ్చి చేరినవన్నీ అభిమానులు ముద్దుగా పెట్టుకున్న ప్రస్తావనలే. ‘అన్నయ్యా..’ అని చిరంజీవిని (Chiranjeevi) అభిమానులు పిలిస్తే, ఆ పిలుపులో ఓ ఆత్మీయత కనిపిస్తుంటుంది. ‘నేను సినీ పరిశ్రమలోకి రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి..’ అని నేటి తరం యువ దర్శకులూ చెబుతున్నారంటే, దటీజ్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి.. ఆయనో వ్యక్తి కాదు శక్తి. ఆయన డాన్స్ చేస్తే సంచలనం. ఆయన తెరపై ఫైట్లు చేస్తే సంచలనం. ఆయన డైలాగ్ చెప్పినా, ఆ డైలాగుల్లోని పవర్.. సెటైర్.. అన్నీ ప్రత్యేకమే. చిరంజీవి అంటే కంప్లీట్ ప్యాకేజ్. అదే మెగా ప్యాకేజ్. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి (Chiru) సినిమా రిలీజయితే పండుగ.. ఆయన పుట్టినరోజు ఓ పండుగ.. ఆయనతో కలిసి ఫొటో దిగితే అదో పండగ.. ఆయన నటించే సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తే అదో పండగ.. ఆయన సినిమాకి దర్శకత్వం వహిస్తే, ఆయన సినిమాని నిర్మించే అవకాశం వస్తే.. అన్నీ పండగలే. దటీజ్ చిరంజీవి.
చిరంజీవి అంటే శిఖరం.. చిరంజీవి అంటే ఆకాశం.. సామాన్యుడిగా ప్రయాణం మొదలు పెట్టి.. అసామాన్య స్థాయికి ఎదిగి.. కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో మెగాస్టార్ చిరంజీవిగా తిరుగులేని గౌరవాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. ఆ స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. దటీజ్ మెగాస్టార్.
పనిగట్టుకుని చిరంజీవిని విమర్శించాలనుకున్నా, ఆ తర్వాత ఇంటికెళ్ళి ఏడవాల్సిన పరిస్థితే ఎవరికైనా. ఎందుకంటే, చిరంజీవి అందరివాడు. దటీజ్ చిరంజీవి. హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవికి (Mega Star Chiranjeevi) పుట్టిన రోజు శుభాకాంక్షలు.. Happy Birthday To Mega Star Chiranjeevi..