Happy Republic Day.. పాఠకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.!
గణతంత్రమంటే.? ఈ జనరేషన్‌లో చాలామందికి తెలియదు. జస్ట్ జెండా పండుగ.! ఓ సెలవు దినం.
కార్పొరేట్ చదువుల నేపథ్యంలో, ఆ సెలవు ఎందుకో కూడా తెలీదు. పైగా, సెలవు రోజున కూడా పోటీ పరీక్షల ప్రిపరేషన్.. ఇలా ఏదేదో వ్యాపకం.! అదీ తీవ్ర ఒత్తిడితో కూడిన వ్యాపకం.
రాజకీయ నాయకులు ఊరూ వాడా జెండాలు ఎగుర వేసేసి.. స్వీట్లు, పళ్ళు పంచేస్తుంటారు. ఫొటోలకు పోజులిచ్చేస్తుంటారు.
Happy Republic Day.. హక్కులే కాదు.. బాధ్యతలు కూడా.
ఈ దేశం నాకేమిచ్చింది.? అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తడం సహజమే. దేశానికి మనం ఏమిచ్చాం.? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన సందర్భాలే ఈ జెండా పండుగలు.
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.! మరి, ఆ మనుషులే అమ్ముడుపోతే.? ప్రజాస్వామ్యానికి అర్థమేంటి.? రాజ్యాంగం తాలూకు గొప్పతనమేంటి.?
Mudra369
రాజ్యాంగం మనకి చాలా హక్కులిచ్చింది. దాంతోపాటు, చాలా బాధ్యతలు కూడా మన భుజాన వున్నాయని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
రాజకీయ అవినీతి దేశానికి శాపం. ఓటు కూడా అవినీతిమయం అయిపోతే, ప్రజాస్వామ్యానికీ.. రాజ్యాంగానికీ అర్థమేముంటి.?
నాయకులు అమ్ముడుపోతున్నారు.. ప్రజలు సైతం.!
రాజకీయ నాయకులు అమ్ముడుపోవడంలో వింతేమీ లేదు. ప్రజలూ అమ్ముడుపోతుండడమే బాధాకరం.
డబ్బులివ్వకుండా ఓట్లు అడగలేని దుస్థితి రాజకీయ నాయకులది. డబ్బులు తీసుకోకుండా ఓట్లేయలేని దుస్థితి ప్రజలది.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంటే.. కులం, మతం, ప్రాంతం.. ఇలా దేశంలో చాలామంది కొట్టుకు ఛస్తున్నారు.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
చట్ట సభల్లో చర్చ జరగడం అనేది పాత కథ. ఇప్పుడు జరుగుతున్నదంతా రచ్చ మాత్రమే. ప్రశ్నించాల్సిన ప్రజలేం చేస్తున్నారు.? ప్రజలెందుకు బాధ్యతల్ని విస్మరిస్తున్నారు.?
ప్రజా ప్రతినిథుల్ని తయారు చేసేది ప్రజలే.! ప్రజలే నాయకుల్ని ప్రజా ప్రతినిథులుగా చేయగలరు.
వ్యవస్థ మారాలంటే, ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పు వస్తేనే, అసలు సిసలు గణతంత్రం.. ఘనమైన ప్రజాస్వామ్యం.!
– yeSBee