Hardik Pandya Natasha Wedding.. ఓసారి పెళ్ళయితే సరిపోదు.! ఇంకోసారి కొత్తగా పెళ్ళి చేసుకోవాల్సిందే. ఇదీ నయా ట్రెండ్.!
మొన్నామధ్యన నయనతార – విఘ్నేష్ శివన్ పెళ్ళి పీటలెక్కారు.. అంగరంగ వైభవంగా జరిగింది ఆ పెళ్ళి. నిజానికి, ఈ జంట అంతకు ముందే వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
కాకపోతే, మొదటిసారి పెద్దగా ఎవర్నీ తమ వివాహానికి ఆహ్వానితులుగా పిలవలేదు. అసలు పెళ్ళయ్యిందన్న విషయాన్నే ఎక్కడా ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు.
మళ్ళీ పెళ్ళి పబ్లిసిటీ కోసమా.? సరదా కోసమా.? సొమ్ముల కోసమా.? ఓటీటీ సంస్థలు ఎగబడ్డంతోనేనా పెళ్ళి పేరుతో ఈ నయా ట్రెండింగ్ వ్యాపారం.?
Mudra369
నయనతార (Nayanthara) – విఘ్నేష్ శివన్ దంపతులకు ‘సరోగసీ’ విధానంలో కవలలు పుట్టాక, పెళ్ళయిన కొద్ది నెలలకే అదెలా సాధ్యం.? అన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి.
దాంతో, చాలాకాలం క్రితమే తమకు పెళ్ళయిన విషయాన్ని బయటపెట్టారు విగ్నేష్ శివన్ – నయనతార. ఇంకోస్సారి హనీమూన్ కూడా చేసుకున్నారండోయ్.!
Hardik Pandya Natasha Wedding.. ‘నయన’ ట్రెండు.!
బహుశా నయనతార – విఘ్నేష్ శివన్‌లను స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నాడు క్రికెటర్ హార్దిక్ పాండ్యా. భార్య నటాషాతో ఇంకోసారి వివాహానికి సిద్ధమయ్యాడు ఈ డాషింగ్ క్రికెటర్.

కోవిడ్ సమయంలో ఈ జంట వైవాహిక బంధంతో ఒక్కటయ్యింది. హార్దిక్ పాండ్య (Hardik Pandya) – నటాషా దంపతులకు ఓ కొడుకు కూడా వున్నాడు.
ఈ జంట ఇంకోసారి పెళ్ళి పీటలెక్కబోతోంది. మూడు రోజులపాటు వివాహ వేడుకలు జరుగుతాయట. ఫిబ్రవరి 13 నుంచి 16వ తేదీ వరకు వివాహ వేడుకల కోసం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ని వేదికగా చేసుకున్నారు.
ఓసారి రిజిస్టర్ మ్యారేజ్.. ఆ తర్వాత సంప్రదాయ పద్ధతిలో వివాహం.. ట్రెండ్ అదిరింది కదూ.!
Read Also: నా భర్త విడాకులకి నేను కారణం కాదు: ఈ కెలుకుడేల హన్సిక.?
అన్నట్టు, సెలబ్రిటీల వివాహ వేడుకలకు ఓటీటీ సంస్థలు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ముందుకొస్తుండడంతో.. ఈ ‘మళ్ళీ పెళ్ళి కాన్సెప్ట్ వైపు మొగ్గు చూపుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది.
ఇంకోసారి పెళ్ళి చేసుకోవడానికి.. సెలబ్రిటీలు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పైగా, ఓటీటీ సంస్థలే ఎదురు చెల్లించి మరీ ఆయా వివాహ వేడుకల్ని జరిపించేస్తున్నాయి.
పెళ్ళి కూడా యాపారం అయిపోయింది మరి.!