Harish Shankar Mega Trimurthulu.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ సినిమా కోసం కథ సిద్ధం చేసుకున్నాడట దర్శకుడు హరీష్ శంకర్.
ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్‌తో (Power Star Pawan Kalyan) ఓ సినిమా చేసిన దర్శకుడు హరీష్ శంకర్, ఇంకో సినిమా చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు.
హరీష్ శంకర్ – పవన్ కళ్యాన్ కాంబినేషన్‌లో మొదటి సినిమా ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ అయితే, రెండో సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’.. ప్రారంభమైందిగానీ, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
Harish Shankar Mega Trimurthulu.. చిరంజీవితో సినిమా ఏమైనట్టో.?
కొన్నాళ్ల క్రితమే మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే, ఆ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియని పరిస్థితి.
ఇక, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan)తోనూ హరీష్ శంకర్ (Harish Shankar) ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అదీ వాస్తవ రూపం దాల్చలేదు.
నిజానికి, హీరోలతో డేట్లు ఇప్పుడు దర్శకులకు శాపంగా మారుతున్నాయ్. ఏడాదికి ఓ సినిమా చేయడం స్టార్ హీరోలకు కష్ట సాధ్యమైపోయింది. అదే అన్ని సమస్యలకీ కారణం.
త్రిమూర్తులు.. మెగా హీరోలతో సాధ్యమయ్యేనా.?
ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అలాగే, చిరంజీవి (Mega Star Chiranjeevi) – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లోనూ హరీష్ శంకర్ సినిమా చేయొచ్చు.
Also Read: Trisha Krishnan Brinda: దేవుడంటే భయపడాల్సిందే.!
కానీ, అంతకన్నా ముందు పవన్ కళ్యాణ్ ‘ భవదీయుడు భగత్ సింగ్’ పూర్తి చేయాలి. రామ్ చరణ్, తన చేతిలో వున్న ప్రాజెక్టుల్ని కొలిక్కి తీసుకురావాలి. చిరంజీవి సంగతి సరే సరి.
ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో సినిమా, గెస్ట్ రోల్స్‌లో చరణ్, పవన్.! దీనికైతే కొంత పాజిబిలిటీ వుంది.