HBD Mrunal Thakur.. తొలి తెలుగు సినిమాతోనే సెన్సేషనల్ హీరోయిన్ అనిపించేసుకుంది మృణాల్ ఠాకూర్. అదే ‘సీతారామం’.!
అంతకు ముందు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కొన్ని హిందీ సినిమాలు చేసినా, నటిగా ఆమెకు ఏమంత గుర్తింపు రాలేదు.
‘సీతారామం’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన మృణాల్ ఠాకూర్‌కి, తెలుగుతోపాటు వివిధ సినీ పరిశ్రమల నుంచి బోల్డన్ని ఆఫర్లు పోటెత్తాయ్.
HBD Mrunal Thakur.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా..
అయితే, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ, లిమిటెడ్ సినిమాలే చేసింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).
మొన్నామధ్యన వచ్చిన ‘హాయ్ నాన్న’ (Hi Nanna) మరో మారు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు అంతటా మార్మోగిపోయేలా చేసింది.

కానీ, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో చేదు ఫలితాన్నే చవిచూడాల్సి వచ్చిందీ భామ. మళ్ళీ ‘సీతారామం’ లాంటి సినిమా ఎప్పుడు.? అన్న ప్రశ్న మృణాల్ ఠాకూర్‌కి ఎదురవుతోంది.
ట్రోలింగ్ తప్పట్లేదు..
ఇదిలా వుంటే, మృణాల్ ఠాకూర్ ఫిట్నెస్ విషయంలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది. తన ఫిజిక్‌ని తాను ఎంజాయ్ చేస్తున్నాననీ, తన కోసం తాను వర్కవుట్స్ చేస్తున్నాననీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తెలుగులోనూ, తమిళంలోనూ.. అలాగే హిందీలోనూ కొన్ని ప్రాజెక్టులు చేస్తోంది మృణాల్ ఠాకూర్.
గ్లామర్ కంటే కూడా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కే తన ప్రాధాన్యత అనీ, అలాగని గ్లామరస్ పాత్రల్ని వదిలేసుకోననీ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.
Also Read: రెండో రౌండ్.! ప్యాంట్ సరిపోవట్లేదు.!
మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకి పుట్టిన రోజు (Happy Birthday Mrunal Thakur) శుభాకాంక్షలు.
			        
														