ప్రేమలో పడ్డావా.? కేవలం స్నేహం మాత్రమేనా.?
Manushi Chillar Lover Veer.. నటి మానుషి చిల్లర్ గుర్తుందా.? అదేనండీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలో నటించింది కదా.. ఆ బ్యూటీనే.!
అందాల పోటీలు, ఆపై మోడలింగ్.. అట్నుంచి సినిమాల్లోకొచ్చిన మానుషి చిల్లర్‌కి (Manushi Chillar) నటిగా ‘సామ్రాట్ పృధ్వీరాజ్’ తొలి సినిమా.
‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘బడే మియా ఛోటే మియా’ సినిమాల్లోనూ నటించింది మానుషి చిల్లర్. ప్రస్తుతం ‘టెహ్రాన్’ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.
Manushi Chillar Lover Veer.. ప్రేమలో పడిందా.?
మానుషి చిల్లర్ (Manushi Chillar) ప్రేమలో పడిందా.? లేదా.? ఛత్.. అది కేవలం స్నేహమే.. అనే వాదనా లేకపోలేదు. ఇంతకీ, అటువైపున్నది ఎవరు.?
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో మానుషి చిల్లర్ చెట్టాపట్టాలేసుకు తిరుగుతోందిట.
ఈ విషయాన్ని వెల్లడించింది, సోషల్ మీడియా సెన్సేషన్ ‘ఓరి’.! బాలీవుడ్ సినీ ప్రముఖులతో ‘ఓరీ’కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయ్.
Also Read: పులస పాతిక వేలు.! ఈ ‘చేప’ని తినని జన్మెందుకు.?
జాన్వీ కపూర్, మానుషి చిల్లర్.. ఇంకొంతమంది స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి ఓరీ, ఓ టూర్‌కి వెళ్ళాడట. అక్కడే, మానుషి చిల్లర్ – వీర్ పహారియా మధ్య కెమిస్ట్రీని అతను గుర్తించాడట.
అన్నట్టు, జాన్వీ కపూర్ కూడా శిఖర్ పహారియా.. అనే వ్యక్తితో గత కొన్నాళ్ళుగా స్నేహం చేస్తోన్న సంగతి తెలిసిందే. శిఖర్ పహారియా – వీర్ పహారియా.. ఇద్దరూ సోదరులు కావడం గమనార్హం.
సినిమా తారలన్నాక.. గాసిప్స్‌తో సహజీవనం చేయాల్సిందే.! స్నేహాలు వేరు, ప్రేమలు వేరు.! కొన్ని స్నేహాలు ప్రేమకు దారి తీస్తాయ్.. అందులో కొన్ని మాత్రమే పెళ్ళి పీటల వరకూ వెళ్తాయ్.
Mudra369
శిఖర్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని జాన్వీ (Janhvi Kapoor) ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టతనిచ్చింది. వీర్ పహారియా విషయంలో మానుషి చిల్లర్ నుంచి స్పష్టత రావాల్సి వుంది.
బాలీవుడ్ మీడియా వదలదు కదా.! ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఓ చోట.. మానుషి చిల్లర్ దొరికితే, తనదైన స్టయిల్లో ప్రశ్నించి, ఆమె నుంచి సమాధానాన్ని రాబట్టేస్తుంది. ఈలోగా గాసిప్పులు.. వస్తూనే వుంటాయ్.!