HBD SDT SYG.. ‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందర, ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు సాయి ధరమ్ తేజ్.!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఆ రోడ్డు ప్రమాదంతో ఇక కోలుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు.!
కోలుకోవడమేంటి.? అసలు బతుకుతాడా.? లేదా.? అన్న పుకార్లు పుట్టుకొచ్చాయి. ఉత్త పుకార్లు మాత్రమే కాదు, భయాలు కూడా.!
మెగా కాంపౌండ్ మొత్తం, ఆ రోడ్డు ప్రమాదంతో చాలా చాలా భయపడింది. కానీ, సాయి ధరమ్ తేజ్.. అందరి ఆశీస్సులతో కోలుకున్నాడు.!
కోలుకున్నాడు సరే.. సరిగ్గా మాట్లాడగలడా.? తిరిగి నడవగలడా.? ఇలా మళ్ళీ బోల్డన్ని అనుమానాలు. పలు సర్జీలు జరిగాయి, వాయిస్ సరిగ్గా రావడానికి.
‘బ్రో’ సినిమా వచ్చింది. అందులోనూ, సాయి ధరమ్ తేజ్ అంత తేలిగ్గా మూవ్ అవలేదు. ‘విరూపాక్ష’ హిట్టయినా.. అందులోనూ, కష్టంగానే కదిలాడు సాయి ధరమ్ తేజ్.
HBD SDT SYG.. లెక్కలు మార్చేసిన సంబరాల ఏటి గట్టు
కానీ, ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాకొచ్చేసరికి, లెక్కలు మారిపోయాయ్.! తాజాగా, సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా నుంచి ప్రమోషనల్ వీడియో వచ్చింది.
అంతే, లెక్కలన్నీ సెట్ అయిపోయాయి. కండలు తిరిగిన శరీరంతో.. చాలా అంటే, చాలా చురుగ్గా కనిపించాడు సాయి ధరమ్ తేజ్.!
బీస్ట్ రూపంలో సాయి ధరమ్ తేజ్‌ని చూసిన మెగాభిమానులు, ‘హీ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. ఇంకో వైపు, మెగా సినిమాల మీద పడి ఏడుస్తున్న ఓ వర్గం, సాయి ధరమ్ తేజ్ మీద ట్రోలింగ్ చేస్తూనే వుంది.
Also Read: అదృష్ట దేవత: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
అన్ని ప్రశ్నలకీ సమాధానం ‘సంబరాల ఏటి గట్టు’ సినిమానే ఇవ్వాల్సి వుంది. ఆల్రెడీ ‘ఓజీ’ సినిమాతో, ఆ వర్గానికి సరైన సమాధానం దొరికేసిందనుకోండి.. అది వేరే సంగతి.
‘మేం బ్యాన్ చేస్తే, మెగా సినిమాలు ఆడవ్..’ అంటూ, ఓ వర్గం సోషల్ మీడియాలో చెలరేగిపోయింది.
అయితే, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా వరకూ. ఆ సినిమా సక్సెస్ అవడంతో, ఆ వర్గం దాదాపు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
