Hello AP Welcome Janasena కొత్త నినాదం షురూ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ అని నినదించారాయన.
దాంతో, సహజంగానే.. ‘వైసీపీకి బైబై చెబుతున్నారు.. టీడీపీకి వెల్‌కమ్ చెబుతున్నారు దత్తపుత్రుడుగారు..’ అంటూ వైసీపీ నుంచి సెటైర్లు పడ్డాయ్.
వైసీపీ సెటైర్లకు కాలం చెల్లింది. ఎందుకంటే, ఇకపై జస్ట్ ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ మాత్రమే కాదు, ఇక నుంచి ‘హలో ఏపీ.. బైబై వైసీపీ.. వెల్‌కమ్ జేఎస్‌పీ’ కూడా.!
Hello AP Welcome Janasena.. తాడేపల్లిగూడెంలో జనసేనాని విశ్వరూపం..
ఇప్పటిదాకా ఓ యెత్తు.. ఇకపై ఇంకో యెత్తు.. అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ కొనసాగుతూ వస్తోంది.
తాజాగా, తాడేపల్లిగూడెం ‘వారాహి విజయ యాత్ర’లో జనసేనాని సరికొత్తగా కనిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు.
‘వైఎస్ జగన్ పాలు తాగే పసి పిల్లాడు.. కానీ, జనానికి మాత్రం మద్యాన్ని అమ్ముతాడు..’ అంటూ ఎద్దేవా చేసిన జనసేనాని, ‘వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరు.?’ అని ప్రశ్నించారు.

వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని జనసేనాని ప్రస్తావించారు. వాలంటీర్ల అచారకాల్ని సవివరంగా పేర్కొన్నారు జనసేనాని.
‘ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో బాధ్యతగా పనిచేసే వాలంటీర్లపై నాకెలాంటి కోపం లేదు. ఐదు వేలు కాదు, నేను ఇంకో ఐదు వేలు వేసి.. పదివేలు ఇచ్చే వ్యక్తిని..’ అన్నారు పవన్ కళ్యాణ్.
కొన్ని మంచి మామిడి పండ్ల మధ్యన కుళ్ళిపోయిన పళ్ళుుంటే.. మొత్తం పళ్ళన్నీ కుళ్ళిపోతాయ్.. అంటూ, వాలంటీర్ వ్యవస్థ మాటున వైసీపీ అక్రమాల్ని ఎండగట్టారు జనసేన అధినేత.
ఏడాదికి వెయ్యి కోట్లు సంపాదించగలను..
‘సినీ నటుడిగా ఏడాదికి వెయ్యి కోట్లు సంపాదించగలను.. నాకెందుకు రాజకీయాలు.? అలా అని నేననుకోలేదు.. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. వీళ్ళతో మాటలు పడుతున్నాను.. అని ఆవేదన వ్యక్తం చేశారు జనసేనాని.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
‘నా భార్యనీ.. నా తల్లినీ.. నా పిల్లల్ని కూడా తిడుతున్నారు వీళ్ళు.. ప్రజల కోసం అన్నీ భరిస్తున్నాను..’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.
వైసీపీ పాలనా వైఫల్యాల్ని ఎండగడుతూనే, ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని పంపడంలో జనసేనాని విజయవంతమవుతున్నారు ‘వారాహి విజయ యాత్ర’ ద్వారా.!