Table of Contents
Hyper Pigmentation Black neck.. కొంత మందిలో ముఖమంతా తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతున్నప్పటికీ, మెడ చుట్టూ భాగం నల్లగా మారి నిర్జీవంగా కనిపిస్తుంటుంది.
మెడ భాగం నల్లగా మారడానికి అనేక కారణాలున్నాయ్. వేసవిలో అధిక సూర్య కాంతిలో తిరగడం, చెమటలు అధికంగా పట్టడం వంటి కారణాలు కావచ్చు.
వీటితో పాటూ, హార్మోన్ల ప్రభావం కూడా ఓ కారణం కూడా కావచ్చు. దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు.
అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిలవబడే హార్మోన్లు అధికంగా రిలీజ్ అవడం వల్ల మెడ చుట్టూ భాగం నల్లగా మారడం జరుగుతుంది.
Hyper Pigmentation Black neck.. అలెవెరా జెల్‌తో కాంతివంతంగా..
హార్మోన్ల కారణం కాదని తెలిస్తే మాత్రం, చిన్న చిన్న ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చునని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.

అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయ్. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుతుంది. తాజా కలబంద జెల్ తీసుకుని నేరుగా మెడపై అప్లై చేయాలి. సున్నితంగా మసాజ్ చేస్తూ 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
బంగాళా దుంప రసం..
స్కిన్ ట్యానింగ్‌ని తొలగించేందుకు బంగాళా దుంప చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా మెడపై నలుపు ఈజీగా పోగొట్టుకోవచ్చు.
బంగాళా దుంపను పేస్ట్‌లా చేసి అందులో కాస్త నిమ్మరసం లేదా. పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని సర్క్యులర్ మోషన్‌లో మెడపై మసాజ్ చేస్తే మంచి ఫలితం వుంటుంది.
పసుపు, పెరుగుతో..
పసుపు, పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా కలిపి మెడకు పట్టించి 30 నిముషాల తర్వాత మసాజ్ చేస్తూ కడిగేస్తే మెడ చుట్టూ వుండే మృత కణాలు తొలగిపోయి మెడ కాంతివంతంగా మెరుస్తుంది.
Also Read: Home Remedies For Dandruff.. చుండ్రు సమస్యకు చెక్ పెట్టేయండిలా.!
ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, ఖచ్చితంగా మంచి ఫలితం వుంటుంది.
గమనిక: ఈ సంకలనం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందరు సంబంధిత వైద్య నిపుణుల నుంచి సేకరించిన సమాచారం మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం నుంచి సేకరించబడింది.