Ileana D Cruz Love.. చెల్లికి పెళ్ళి.. జరగాలి మళ్ళీ మళ్ళీ.. అంటూ ఓ సినిమాలో కామెడీ విలన్ సీరియస్‌గా హాస్యం పండించేస్తాడు.!
రోజులు మారాయ్.! ఎప్పటికప్పుడు బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చెయ్యకపోతే బోర్ కొట్టేస్తోందనే భావనలో వున్నారు చాలామంది అందాల భామలు.
సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటివి చాలానే చూస్తున్నాం. ఏం అబ్బాయిలేనా వాడుకుని వదిలేసేది.? అమ్మాయిలు అలా చేస్తే తప్పా.? అని అనొచ్చుగాక.! అదీ రైటే మరి.!
Ileana D Cruz Love.. ఇలియానా కొత్త ప్రేమికుడట.. నిజమేనా.?
సరే, అసలు విషయానికొచ్చేద్దాం. నాజూకు నడుము సుందరి ఇలియానా (Ileana Love) ప్రేమలో పడిందట. అది కూడా ఓ హీరోయిన్ సోదరుడితో ఇలియానా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందట.

ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు కత్రినా కైఫ్ అట. సరిపోయింది సంబరం.. కత్రినా కైఫ్ కూడా చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చేసి, చివరికి విక్కీ కౌశల్‌ని పెళ్ళాడేసిన సంగతి తెలిసిందే.
ఇంతకీ, ఇలియానా కొత్త ప్రేమ కథలో నిజమెంత.? ఇలియానా గతంలో ఓ బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన సంగతి తెలిసిందే.
చాలా పేద్ద మనసు.!
‘మేమిద్దరం సహజీవనంలో వున్నాం..’ అని ఇలియానా (Ileana D Cruz) స్వయంగా చెప్పుకొచ్చింది కూడా. ఆ తర్వాత వ్యవహారం బెడిసికొట్టింది.. బ్రేకప్ అనేసుకున్నారు.
Also Read: సుస్మితాయణం.! పెళ్ళి కాదు, డేటింగే సుమండీ.!
మధ్యలో ఓ బిజినెస్‌మేన్‌తో ఇలియానా ‘కథ’ నడిపించిందనే ప్రచారమూ జరిగింది. ఓ యంగ్ హీరోని ఇలియానా బుట్టలో వేసుకుందంటూ బాలీవుడ్ మీడియా వండి వడ్డించిన కథనాలూ చూశాం.
అసలు ప్రేమంటేనే ఓ ట్రాష్.. అని ఇలియానా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు. ఇంతలోనే, ఇలియానా కొత్త ప్రేమ కథ.. అంటూ ప్రచారం షురూ అయ్యింది.
కొత్త ప్రేమ కథల సంగతి తర్వాత, ఇలియానా ఇప్పుడు ఏం సినిమాలు చేస్తోందబ్బా.? ప్రస్తుతానికైతే ఆమె చేతిలో సినిమాలేవీ వున్నట్టు లేవు.!
సినిమాల్లేకపోతేనేం, ఇలియానాకి బాలీవుడ్‌లో ‘పరిచయాలు’ చాలా చాలా ఎక్కువ. పార్టీలు, ఫ్రెండ్స్.. వెరసి.. ఇల్లీ బేబ్ ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదిప్పుడు.