Ileana D Cruz ReEntry.. తెలుగు తెరపై ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా, ఆ తర్వాత క్రమంగా తెరమరుగైపోయింది.
కొన్నాళ్ళ క్రితమే తల్లయిన ఇలియానా, తన కొడుకునీ.. తన భర్తని కూడా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.
బేబీ బంప్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన ఇలియానా, ఆ తర్వాత కొడుకుతో కలిసి వున్న ఫొటోలతోనూ హల్‌చల్ చేస్తూనే వుంది.
Ileana D Cruz ReEntry.. అభిమానులతో సోషల్ ముచ్చట్లు..
ఇక, తాజాగా ఇలియానా సోషల్ మీడియా వేదికగా అభిమానులు కొందరు సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఎప్పుడు.? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘ఇప్పట్లో ఆ అవకాశమేదీ లేదు’ అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతానికైతే, తల్లిగా తనకు కొన్ని బాధ్యతలున్నాయనీ, తన కొడుకుతో టైమ్‌పాస్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని ఇలియానా పేర్కొంది.
‘సింగిల్ పేరెంట్’ అన్న కామెంట్‌పై స్పందిస్తూ, తన భర్తతో కలిసి వున్న ఫొటోని షేర్ చేసింది ఇలియానా.
ఇదిలా వుంటే, ఇలియానా త్వరలోనే తెలుగు తెరపై రీ-రీ-రీ-ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈసారి రీ-ఎంట్రీ కూడా మాస్ మహరాజ్ రవితేజతోనేనట.!
నిజమేనా.? నమ్మొచ్చా.?