ఇంగ్లాండ్ జట్టుతో టెస్టుల్లో తొలి మ్యాచ్ ఓడిపోయింది టీమిండియా. మరీ ఇంత దారుణంగా ఓడిపోవడమా.? అన్న విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత పుంజుకుని, టెస్టు సీరీస్‌లో ఇంగ్లాండ్‌ని (India Trash England In All Formats Of Cricket At Home) ఓడించింది. టీ20కి వచ్చేసరికి.. ఇక్కడా అదే సీన్. మొదటి మ్యాచ్ ఓడింది టీమిండియా.
మళ్ళీ ఇక్కడా టీ20 సిరీస్ (India Vs England T20) గెలిచింది. వన్డే మ్యాచ్‌లకు వచ్చేసరికి మొదటి మ్యాచ్ టీమిండియా గెలిచింది. దాంతో, సిరీస్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. మూడో మ్యాచ్ వచ్చేసరికి టెన్షన్ పెరిగిపోయింది అభిమానుల్లో.
తేలిగ్గానే గెలిచేయాల్సిన మ్యాచ్‌ని చివరి బంతి వరకూ లాగింది టీమిండియా (India Vs England). నిజమే మరి, ఇంగ్లాండ్ ఆటగాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చేశారు భారత ఫీల్డర్లు. చాలా తేలిగ్గా క్యాచ్‌లు వదిలేశారు. ఒంటి చేత్తో చెత్త ఫీల్డింగ్ చేశారు.
ఓ దశలో అసలు ఇది టీమిండియా (Team India) గెలవాల్సిన మ్యాచ్ కాదు.. ఇంగ్లాండ్ గెలవడమే కరెక్ట్.. అని భారత క్రికెట్ అభిమానులు కూడా ఫిక్సయిపోయారు. కానీ, అద్భుతమే జరిగింది. మ్యాచ్ ఎలాగైతేనేం టీమిండియా ఖాతాలో పడింది. వెరసి, వన్డే సిరీస్ కూడా టీమిండియా వశమయ్యింది.
400 పరుగులు చేయాల్సిన టీమిండియా 329 పరుగులకు ఆలౌట్ అవడం.. ఓ ఆశ్చర్యకర అంశం. 329 పరుగుల స్కోర్‌ని రెండు మూడు ఓవర్లు వుండగానే దాటేయాల్సిన ఇంగ్లాండ్.. చివర్లో చేతులెత్తేయడం (India Trash England In All Formats Of Cricket At Home) ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.
అంతిమంగా గెలుపు ఇచ్చే కిక్ ఓ రేంజ్‌లో వుంటుంది. ప్రతి మ్యాచ్ ఓ పాఠమే.. కానీ, ఈ మ్యాచ్ ఓ గుణపాఠం. చాలా తప్పులు చేశారు టీమిండియా ఆటగాళ్ళు. గెలుపోటముల సంగతి తర్వాత. ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి ఆటగాడూ.. తప్పులు పునరావృతం కాకూడదు.
ఒక్కటి మాత్రం నిజం.. కుర్రాళ్ళెవరూ ఒత్తడిని ఫీలవడంలేదు.. చాలా ధైర్యంగా ఆడగలుగుతున్నారు. ఈ యాంగిల్‌లో మాత్రం టీమిండియాని అభినందించి తీరాల్సిందే. రిజర్వ్ బెంచ్ గతంలో ఎన్నడూ లేనంత బలంగా వుందంటే అది ఆహ్వానించదగ్గ విషయమే కదా.