Table of Contents
Indian Premiere League Betting ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్ ముగిసింది. పది ఫ్రాంఛైజీలు మొత్తంగా 204 మంది ఆటగాళ్ళను వేలంలో దక్కించుకున్నాయ్. 60 మందికి పైగా విదేశీ క్రికెటర్లు, 130కి పైగా స్వదేశీ ఆటగాళ్ళను వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు సొంతం చేసుకోవడంతో మెగా వేలం పూర్తయ్యింది.
వాట్ నెక్స్‌ట్.? ఇంకేముంటుంది.. ఎంచక్కా, అమ్ముడుపోయిన క్రికెటర్లు బరిలోకి దిగి సత్తా చాటెయ్యడమే. రికార్డు స్థాయిలో వేలం ధర పలుకుతుందనుకున్న ఆటగాళ్ళకు షాక్ తగిలింది. ‘వీళ్ళని ఎవరు కొంటారు.?’ అన్న కేటగిరీలోనివారికి మంచి ధర పలికింది.
Indian Premiere League Betting.. ఐపీఎల్ వేలం.. అయితే ఏంటి.?
ఇంతకీ, ఈ వేలం ద్వారా ఒరిగేదేంటి.? ఇదో పబ్లిసిటీ జిమ్మిక్కు. కోట్లు ఖర్చు చేసి వేలంలో కొనుక్కున్నప్పటికీ, ఆయా ఆటగాళ్ళు తమ సామర్థ్యానికి తగ్గ ప్రదర్శన ఇస్తారా.? అంటే, ‘ఔను’ అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పైగా, ఇది కరోనా కాలం. ఎవరెప్పుడు ‘ఔట్’ అయిపోతారో తెలియని పరిస్థితి.
అసలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఓ జూదం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆటగాళ్ళను వేలంలో కొనుగోలు చేయడం దగ్గర్నుంచి, బెట్టింగుల వరకూ.. అదో పెద్ద ప్రసహనం. పదో తరగతి కుర్రాళ్ళూ బెట్టింగుల మాయలో పడి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటే.. అదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చిన నయా ట్రెండ్.
ఎవడు చూడమన్నాడు.? ఎవడు బెట్టింగుల్లో పాల్గొనమన్నాడు.? అన్నది వేరే చర్చ. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఐపీఎల్ చుట్టూ నడుస్తున్న పబ్లిసిటీ, దానికి తోడు సినీ ప్రముఖుల హంగామా.. వెరసి, ఐపీఎల్ అంటేనే అదో కిక్కు.!
ఐపీఎల్.. వాళ్ళు అలా, వీళ్ళు ఇంకోలా.!
ఇదంతా ఐపీఎల్‌కి (Indian Premiere League) సంబంధించిన ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు, అసలు ఆటగాళ్ళకు ఐపీఎల్ పట్ల వున్న శ్రద్ధ, బాధ్యత ఎంత.? మేటి ఆటగాళ్ళు ఐపీఎల్‌లో ఎందుకు చతికిలపడుతున్నారు.? పెద్దగా సీన్ లేని ఆటగాళ్ళు ఐపీఎల్‌లో ఎందుకు చెలరేగిపోతుంటారు.? ఇదొక మిస్టరీ.
ఐపీఎల్ చుట్టూ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఈ ఐపీఎల్ కారణంగా, టీమిండియాలో తలెత్తతున్న విభేదాలు.. ఇవన్నీ చిన్న విషయాలేమీ కాదు. కానీ, ఐపీఎల్ అంటే దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్, క్రేజ్ వున్నాయ్.
Also Read: కొత్త రాజ్యాంగం రాస్కో బాసూ.! ఇంతకీ, ఏ సిరాతో.!
టాలెంట్ వున్న ఆటగాళ్ళలో కొందరికి ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులోకి అవకాశం దొరుకుతున్నమాట వాస్తవం. అదే సమయంలో, ఐపీఎల్‌లో పెయిల్ అయితే, టాలెంట్ వున్న ఆటగాళ్ళకి శాశ్వతంగా జాతీయ జట్టులోకి వెళ్ళేందుకు ద్వారాలు మూసుకుపోతున్నాయన్నదీ కఠోర వాస్తవం.
ఏంటో ఈ అమ్మకాలు.. ఏంటో ఈ ఆటలు.. ఏంటో ఈ బెట్టింగులు.! ఇదంతా ఐపీఎల్ మాయ.!
జస్ట్ ఎంటర్టైన్మెంట్.!
ఐపీఎల్ అంటే అదొక ఎంటర్టైన్మెంట్. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓ సినిమా చూసినట్టు మాత్రమే. సాధారణ క్రికెట్‌కి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ముడిపెట్టడం అనవసరం. అఫ్ కోర్స్.. సాధారణ క్రికెట్లోనూ బెట్టింగులు, మ్యాచ్ ఫిక్సింగులూ వుంటున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
అంతిమంగా క్రికెట్ అంటే ఓ ఆట మాత్రమే. కానీ, ఇదొక జూదంగా మారిపోయింది. ఐపీఎల్ పుణ్యమా అని, క్రికెట్ అంటేనే జూదం.. (Indian Premiere League Betting) అనే భావన పెరిగిపోయింది. ఈ పాపం ఎవరిది.?