సండే, ఫన్ డేగా మార్చాలని ఐపీఎల్ (IPL 2020 Super Over ‘Secret) నిర్వాహకులు అనుకున్నారా.? అందుకు తగ్గట్టే రెండు మ్యాచ్‌లలు కాస్తా, మూడు సూపర్ ఓవర్లను చవిచూడాల్సి వచ్చిందా.? ఎన్నెన్నో అనుమానాలు. డ్రీవ్‌ు 11 ఐపీఎల్ 2020 ఈసారి చాలా కొత్తగా వుంది.
అందుక్కారణం కరోనా వైరస్. మైదానంలో ప్రేక్షకుల్లేకుండానే ఆటగాళ్ళు క్రికెట్ ఆడేస్తున్నారు. సగటు క్రికెట్ అభిమానుల్లోనూ మునుపటి ఉత్సాహమైతే కన్పించడంలేదు. ఈ నేపథ్యంలోనే ‘కిక్’ కోసం సూపర్ ఓవర్ల మ్యాజిక్‌ని ఐపీఎల్ నిర్వాహకులు అమల్లోకి తెచ్చారా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ముంబై – పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తొలుత ‘టై’గా ముగిసింది. సూపర్ ఓవర్ షురూ అయ్యిందిగానీ, అక్కడా ‘టై’ తప్పలేదు. దాంతో, రెండో సూపర్ ఓవర్ తప్పనిసరయ్యింది. ఈసారి మాత్రం ముంబైపై పంజాబ్ జట్టు పై చేయి సాధించడం గమనార్హం.
నిజానికి ముంబై – పంజాబ్ మ్యాచ్ మొదటి నుంచీ నాటకీయంగానే నడిచింది. సూపర్ ఓవర్లు అయితే అత్యంత నాటకీయంగా ముగిశాయి. ఇక, అంతకుముందు కోల్‌కతా – హైద్రాబాద్ జట్ల మధ్య మ్యాచ్ కూడా ‘టై’ అవడంతో, సూపర్ ఓవర్ తప్పలేదు.
సూపర్ ఓవర్‌లో హైద్రాబాద్ చేతులెత్తేయగా, కోల్‌కతా సత్తా చాటింది. చిత్రమేంటంటే కోల్‌కతా – హైద్రాబాద్ మధ్య జరిగిన సూపర్ ఓవర్, ముంబై – కోల్‌కతా మధ్య జరిగిన తొలి సూపర్ ఓవర్ ‘లో స్కోరింగ్’గానే ముగిశాయి. బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారన్నది నిర్వివాదాంశం ఈ రెండు సూపర్ ఓవర్లకు సంబంధించి.
అయితే, బ్యాట్స్‌మెన్ ఎందుకు అలా చేతులెత్తేశారన్నది మాత్రం క్రికెట్ అభిమానులకు అర్థం కావడంలేదు. ఏదిఏమైనా, క్రికెట్ అభిమానులకి ఈ సండే బోల్డంత ఫన్ ఇచ్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
ఈ సీజన్‌లో దాదాపుగా ప్రతి మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుండడం వెనుక, ఆయా జట్ల మధ్య టఫ్ ఫైట్ వుండడమే కారణమా.? లేదంటే, ఐపీఎల్ డల్‌గా సాగుతుండడంతో నిర్వాహకులే ఆ ‘ఉత్కంఠను’ క్రియేట్ చేస్తున్నారా.? అన్న అనుమానాలైతే అభిమానుల్ని వెంటాడుతున్నాయి.