Isha Koppikar Me Too.. బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అక్కినేని నాగార్జునతో ‘చంద్రలేఖ’ అనే సినిమాలో ఈ బ్యూటీ నటించిన సంగతి తెలిసిందే.
‘చంద్రలేఖ’ (Chandralekha) తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మొన్నామధ్యన యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) నటించిన ‘కేశవ’ (Kesava) సినిమాలో పోలీస్ అధికారిగా కనిపించింది. బోల్డ్ హీరోయిన్ మాత్రమే కాదు.. డైనమిక్ లేడీ.. అన్పించుకుంది ఇషా కొప్పికర్.. తన సినిమాలతో, తనదైన ఆటిట్యూడ్‌తో.
ఏకాంత సేవకు రమ్మన్న ఆ హీరో ఎవరబ్బా.?
అసలు విషయమేంటంటే, ఇషా కొప్పికర్‌ని (Isha Koppikar) ఓ హీరో ఏ‘కాంత’ సేవకు రమ్మని పిలిచాడట. ఆ విషయం నిర్మాత ద్వారా కబురంపాడట. ‘హీరోగారు మిమ్మల్ని ఒంటరిగా కలవమన్నారు..’ అని ఓ నిర్మాత తనకు చెప్పడంతో, విషయమేంటో కనుక్కుందామని తానే స్వయంగా ఆ హీరోకి ఫోన్ చేసి మాట్లాడినట్లు చెప్పింది ఇషా కొప్పికర్.

‘నువ్వు మాత్రమే రావాలి.. ఏకాంతంగా చర్చించుకుందాం.. వ్యక్తిగత సహాయకులెవర్నీ తీసుకురావొద్దు..’ అని ఆ హీరో, ఇషా కొప్పికర్‌కి చెప్పాడట. దాంతో విషయం అర్థమయి, అటువైపు వెళ్ళడం మానేశాననీ, ఆ సినిమా కూడా ఒప్పుకోలేదని ఇషా కొప్పికర్ తాజాగా సెలవిచ్చింది.
Isha Koppikar Me Too.. పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు కదా.?
ఇప్పుడు చెప్పడంలో తప్పు లేదు.. కానీ, అప్పట్లో ఆ విషయాన్ని బయటకు చెప్పకపోవడమే పెద్ద తప్పని ఇషా కొప్పికర్‌కి ఇప్పుడన్నా అర్థమయ్యిందో లేదో.!
సరే, ఈ మధ్య కొందరు హీరోయిన్లు, చీకట్లో రాళ్ళు విసురుతున్నారు.. ఉత్త రాళ్ళు కావు, బురదతో నింపిన రాళ్ళవి. అవి ఎవరి మీద పడుతున్నాయో తెలియని పరిస్థితి. ఇదో టైపు పబ్లిసిటీ స్టంటు కూడా.!
Also Read: Gehraiyaan: అలా ఎదిగి, ఇలా దిగజారిపోయిన దీపిక.!
‘మీ టూ’ అంటూ ఆ మధ్య చాలామంది చాలా హంగామా చేసి, ఆ తర్వాత సైలెంటయిపోయిన విషయం విదితమే. ఇది కూడా అలాంటి బాపతేనని అనుకోవచ్చా.? నిజంగానేనా.?
ఎవరి గోల వారిది. ఇప్పటికైనా ఆ హీరో పేరు చెబితే, కొత్తగా సినీ రంగంలోకి వచ్చే మహిళలకు అది మరింత ధైర్యాన్నిస్తుంది కదా.?