Ishan Kishan.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై తరఫున ఆడి అందర్నీ ఆకట్టుకున్నాడు ఇషాన్ కిషన్ అనే ఓ యంగ్ క్రికెటర్.!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రోత్సాహంతో క్రికెట్‌లో అంచలంచెలుగా ఎదిగాడు. వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్‌మెన్‌గా తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు ఇషాన్.
ఇప్పుడీ చిచ్చరపిడుగు ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. అదీ బంగ్లా జట్టు మీద. అందునా, బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి టీమిండియా తీవ్ర ఒత్తిడిలో వున్నప్పుడు.!
Ishan Kishan.. దూకుడే బలహీనత.. దూకుడే బలం.!
వీరేందర్ సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అతనికి దూకుడే బలహీనత. అదే అతని బలం కూడా.! క్రికెట్‌లో రాణించడం కష్టమేనని అంతా అనుకున్నారు.
కెరీర్ బిగినింగ్ నుంచీ.. కెరీర్ ముగిసేవరకూ.. సెహ్వాగ్ ఒకే దూకుడు ప్రదర్శించాడు. తిరుగులేని రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఖాతాలో డబుల్ సెంచరీ వుంది.

పద్ధతిగా ఆడే సచిన్ టెండూల్కర్ కూడా డబుల్ సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మ కూడా డబుల్ సెంచరీ బాదాడు.. కాదు కాదు డబుల్ సెంచరీలు బాదాడు.
వన్డే అద్భుతాలివి..
వన్డేల్లో సెంచరీ కొడితే వింత.. అనలేంగానీ.. అది చిన్న విషయం కాదు. అలాంటిది డబుల్ సెంచరీ.. ఇది ఆషామాషీ వ్యవహారమైతే కాదు.
జట్టులో చోటు కష్టమనే పరిస్థితిని ఇషాన్ చాలాసార్లు ఎదుర్కొన్నాడు. వచ్చిన అవకాశాల్ని నద్వినియోగం చేసుకోవడంలోనూ కొన్నిసార్లు విఫలమయ్యాడు.
Also Read: నయా వైరస్సూ.! సరికొత్త బెదిరింపుల్సూ.!
కానీ, ఈసారి చితక్కొట్టాడు.! 200 పరుగులు చేసేశాడు బంగ్లా జట్టు మీద. ‘300 కూడా కొట్టేవాడ్నేగానీ..’ అంటూ ఇషాన్ కిషన్ వ్యాఖ్యానించడం విశేషం.
ఏమో, ముందు ముందు వన్డేల్లో ట్రిపుల్ సెంచరీని కూడా చూసేస్తామేమో.!
టీమిండియా తరఫున ఇప్పటికి మొత్తంగా నలుగురు ఆటగాళ్ళు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ప్రపంచ క్రికెట్‌లో వన్డేలకు సంబంధించి మొత్తం తొమ్మిది డబుల్ సెంచరీలున్నాయి.
డబుల్ సెంచరీ కొట్టిన భారత ఆటగాళ్ళలో ఇషాన్ కిషన్ నాలుగో క్రికెటర్.! రోహిత్ శర్మ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు కొట్టాడు.