Table of Contents
Nabha Natesh.. ‘నన్ను దోచుకుందువటే..’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది ముద్దుగుమ్మ నభా నటేష్. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ అండ్ స్ర్కీన్ అప్పియరెన్స్‌తో అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకుంది.
అయితే, ఈ అమ్మడికి పాపులారిటీ వచ్చింది మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో. క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
Nabha Natesh.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్..
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపించి, నభా నటేష్ ప్రేక్షకులకు షాకిచ్చింది ఈ సినిమాతో. ఈ సినిమాతో నభా నటేష్ ఇస్మార్ట్ బ్యూటీగా పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకుంది. వరుసగా అవకాశాలూ దక్కించుకుంటోంది.
సినిమాలతోనే కాదు, సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్‌గా వుండే నభా నటేష్ నెట్టింట వీర లెవల్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఫాలోవర్స్‌కి కిక్కెక్కించేలా.. తద్వారా మరింత మంది ఫాలోవర్స్‌ని పెంచుకునేలా అప్పుడప్పుడూ కొత్త కొత్త ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటుంది నభా నటేష్.
ఇస్మార్టు గ్లామరూ.. ఆరా షురూ..
అలా తాజాగా నభా నటేష్ ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట్ ట్రెండింగ్ అయ్యింది. బెంగుళూర్‌లో జరిగిన ఈ స్పెషల్ ఫోటో షూట్‌లో నభా నటేష్ సరికొత్త లుక్స్‌లో కనిపిస్తోంది.
ఈ ఫోటో షూట్ ఏదైనా సినిమా కోసమా.? లేక ఇంకేదైనా స్పెషల్ షూట్ కోసమా.? అంటూ ఆరా తీస్తున్నారు నెటిజనం.
ఆరా సంగతి అటుంచితే, ఈ ఫోటోల్లో నభా నటేష్ లుక్స్ చూపు తిప్పుకోనీయడం లేదు. లైట్ ఆరెంజ్ కలర్ గగ్రా చోళీ ధరించి అందంగా మెరిసిపోతోంది నభా నటేష్.
అందానికి ‘హుందా’ హంగులు..
డ్రస్‌తో పాటు, నభా నటేష్ ధరించిన జ్యూయలరీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ ముక్కు పుడక. అచ్చు అమ్మోరిని తలపిస్తోందంటే అతిశయోక్తి కాదేమో.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
పెద్ద పెద్ద చెవి పోగులను మ్యాచ్ చేసే పాపిట బొట్టు నభా నటేష్ (Nabha Natesh) అందాన్ని చాలా హుందాగా ప్రజెంట్ చేస్తోంది. ఇక ఈ ప్రశాంత వదనంతో నభా నటేష్ హావ భావాలు ఈ మొత్తం ఫోటో షూట్‌కే మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.
మహల్‌ని తలపించేలా వున్న బ్యాక్ గ్రౌండ్, కలర్ ఫార్మేట్.. ఇలా అన్నీ సమపాళ్లలో వుంటే, అదేనేమో ఇస్మార్ట్ అందంమంటే.!