Jagan Balakrishna Alcohol Assembly.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ని ఉద్దేశించి ‘సైకోగాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అది కూడా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో. ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ముఖ్యమంత్రిని ఇలా దూషించడం సబబేనా.? అన్న చర్చ జరుగుతూనే వుంది.
బాలయ్య వ్యాఖ్యలపై తీరిగ్గా స్పందించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘తాగి అసెంబ్లీకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తే ఎలా.? స్పీకర్‌కి అయినా ఇంగితం వుండాలి కదా..’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
అంతే కాదు, ‘స్పీకర్ బాధ్యతా రాహిత్యాన్ని’ కూడా ప్రశ్నించేశారు వైఎస్ జగన్, తనకు మాత్రమే సాధ్యమయ్యే ఓ వింత ప్రెస్ మీట్ ద్వారా.!
Jagan Balakrishna Alcohol Assembly.. అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించొచ్చు కదా.?
వాస్తవానికి, ఇదే ప్రశ్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీకి వెళ్ళి సంధించి వుండొచ్చు. అదే ఆయన చేసి వుండాలి. ఎందుకంటే, శాసన సభ్యుడిగా వైఎస్ జగన్‌కి కొన్ని హక్కులుంటాయి.
తోటి శాసన సభ్యుడు తనపై అవమానకరమైన రీతిలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో, అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ ‘క్షమాపణ’ కోరి వుండాలి బాలయ్య నుంచి.
కానీ, అసలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడానికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టపడటంలేదు. ఇష్టపడటం లేదా.? భయమా.? అన్నదానిపై బిన్న వాదనలున్నాయి.
తప్ప తాగి అసెంబ్లీకి వెళుతున్నారా.?
నందమూరి బాలకృష్ణ సంగతి కాస్సేపు పక్కన పెడదాం. వైసీపీ హయాంలో, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జగన్ వున్నప్పుడే, పలువురు వైసీపీ నేతలు, చంద్రబాబుపై దూషణలకు దిగారు.
‘సైకో గాడు’ అన్నది చాలా చిన్న మాట అప్పట్లో. బూతులు తిట్టారు కొందరు వైసీపీ నేతలు. ‘సైకో గాడు’ అని బాలయ్య తప్పతాగి జగన్‌ని తిట్టింది నిజమైతే, అప్పటి వైసీపీ నేతలు కూడా అదే చేశారా.?
అంటే, ముఖ్యమంత్రిగా జగన్ అసెంబ్లీలో వున్న సమయంలో వైసీపీ శాసన సభ్యులు కూడా తప్ప తాగి నోటికొచ్చింది వాగారా.?
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
జగన్ చేసిన తాజా వ్యాఖ్యలతో, తమ ఎమ్మెల్యేలు అప్పట్లో తప్ప తాగి అసెంబ్లీలో నోటికొచ్చినట్లు వాగారని వైఎస్ జగన్ స్వయంగా అఫిడవిట్ ఇచ్చుకున్నట్లయ్యింది.
నిజానికి, ఈ అంశంపై చర్చ జరగాలి. ప్రజా వేదికలపైనా.. అలాగే చట్ట సభల్లోనూ చర్చ జరిగి తీరాలి.! అసెంబ్లీ బయట ఇకపై ‘ఆల్కహాల్ టెస్టులు’ కూడా చేయాల్సి వుంటుందేమో.!
ఎమ్మెల్యే అసెంబ్లీకి తప్ప తాగి వెళ్ళి, పిచ్చ వాగుడు వాగడం నిజమే అయితే.. స్పీకర్ ఏం చేస్తున్నట్లు.?
ఒకవేళ జగన్ ఆరోపణ నిజం కాకపోతే, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, పులివెందుల ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.?
