కంటి పాప.. ‘వకీల్‌సాబ్’లో వింటేజ్ పవన్ కళ్యాణ్.!
అప్పటికప్పుడు సరికొత్త మేకోవర్ సంపాదించుకోవడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూటే సెపరేటు. ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి రకరాల గెటప్‌లు ఇప్పటికే చూశాం. కానీ, ఈసారి వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan Vintage Look In Vakeel Saab)) చూస్తున్నాం.
బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం ‘పింక్’ తెలుగు రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’, ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.
కాగా, ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి ‘కంటి పాప’ అంటూ సాగే మెలోడియస్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.
పవన్ కళ్యాణ్‌ని ఈ పాటలో చూసినవారంతా, వింటేజ్ పవన్ కల్యాణ్‌ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ మేకోవర్ పవన్ కళ్యాణ్ అభిమానులకి బోల్డంత కిక్ ఇస్తోందన్నది నిర్వివాదాంశం.
కాగా, లిరికల్ సాంగ్ వీడియోను చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసింది చిత్ర బృందం. లిరిక్స్ చాలా బావున్నాయి.
పవన్ కళ్యాణ్, శృతిహాసన్ మీద చిత్రీకరించిన సన్నివేశాలు విజువల్‌గా చాలా బావున్నాయి. ఈ సాంగ్, అభిమానులకు థియేటర్లలో స్పెషల్ ట్రీట్ అవుతుందన్నది నిర్వివాదాంశం.
ఒరిజినల్ ‘పింక్’తో పోల్చితే, ‘వకీల్ సాబ్’ సినిమా కోసం చాలా మార్పులు చేసినట్లే కనిపిస్తోంది.
అస్సలేమాత్రం కమర్షియల్ అంశాలకు తావులేని ‘పింక్’ని, ‘వకీల్ సాబ్’గా (Pawan Kalyan Vintage Look In Vakeel Saab) ఎలా కమర్షియల్ యాంగిల్‌లో చూపించబోతున్నారో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు వేచి చూడాల్సిందే.