Jagan Chandrababu Public Money.. అసలు రాజకీయం అంటే ఏంటి.? పరిపాలన అంటే ఏంటి.?
ప్రజాస్వామ్య భారతంలో ప్రభుత్వాలు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు.. పన్నులు, ప్రజాధనం.. వీటి గురించి ఎంతమందికి అవగాహన వుంది.?
మాకవన్నీ తెలీదు.! ఓట్లేశామా.? సంక్షేమ పథకాలు అందుకున్నామా.? అన్నట్లే వుంటారు చాలామంది.!
అందుకే, సంక్షేమం ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయం రాజ్యమేలుతోందిప్పుడు.! అసలు సంక్షేమం అంటే ఏంటి.?
అభివృద్ధి ఫలాలు అందరికీ.. ఇదీ సంక్షేమం తాలూకు అర్థం.! అసలంటూ అభివృద్ధి లేకపోతే, సంక్షేమానికి అర్థం ఏముంటుంది.?
ఎన్నికలొస్తే.. ఓటర్లను కరెన్సీ నోట్లతో కొనేస్తున్నాయి రాజకీయ పార్టీలకు. సరే, డబ్బులు పంచితే గెలిచేస్తారా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
వెయ్యికి పడకపోవచ్చు.. కానీ, పదివేల రూపాయలకు పడతారు కదా.! ఇదే నేటి రాజకీయం.! రాజకీయ పార్టీలకు వందల కోట్ల రూపాయల నిధులు సమకూరుతున్నది, ఇదిగో ఇలా ఓట్లు కొనడానికే.!
కోట్లు ఖర్చు చేసి గెలిచినోడు, ప్రజా సేవ ఎందుకు చేస్తాడు?. ఖర్చు చేసిన దానికి పది రెట్లు.. వంద రెట్లు సంపాదించాలనే కదా అనుకుంటాడు.?
Jagan Chandrababu Public Money.. చంద్రబాబు ఇది ఇచ్చాడు.. జగన్ అది ఇచ్చాడు.!
ఏమిస్తారు.? ఏమీ ఇవ్వరు.! మరి, ఏం చేస్తారు.? పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన మంచిదా.? చెడ్డదా.? అన్నదే చర్చనీయాంశం అవ్వాలి.
చంద్రన్న కానుక.. జగనన్న కానుక.. ఇదీ పరిస్థితి.! చంద్రబాబు (Nara Chandrababu Naidu) జేబులోంచి రూపాయి తీసి ఖర్చు చేయడు. జగనన్న (Ys Jagan Mohan Reddy) కూడా అంతే.!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయినాసరే, తన జేబులోంచి తీసి ఏ సంక్షేమ పథకమూ అమలు చేయలేరు.! మరి, వారి పేర్లెందుకు.?

ప్రజల్లో ఇదే చర్చనీయాంశం అవ్వాలి. ప్రజలు పన్నులు కడతారు. ఆ పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జమ అవుతాయి.
కేంద్రం, రాష్ట్రాలకు కొంత వాటా ఇస్తుంది పన్నుల్లోంచి. అలా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర వాటాగా కొంత సొమ్ము జమచేయబడుతుంది.
రాష్ట్రం ఎలాగైతే వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందో, కేంద్రం కూడా అంతే. కేంద్రం ఖర్చు చేసినా, రాష్ట్రం ఖర్చు చేసినా.. అదంతా ప్రజల సొమ్మే.!
రోడ్లు వేసుకున్నా.. ప్రాజెక్టులు కట్టుకున్నా.. ప్రజలే.!
రోడ్లు వేస్తే.. అది ప్రజాధనంతోనే.! ప్రాజెక్టులు కడితే.. అదీ ప్రజాధనంతోనే.! ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం ఎక్కితే.. అదీ ప్రజాధనంతోనే. ప్రధాని ప్రత్యేక విమానమెక్కినా.. దానికీ, ప్రజాధనమే ఖర్చు చేయాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఉద్యోగులే కాదు.. ప్రజా ప్రతినిథులూ జీతగాళ్ళే. కాకపోతే, ముఖ్యమంత్రి – ప్రధాన మంత్రి.. వీళ్ళంతా గౌరవ వేతనాలు అందుకునే జీతగాళ్ళు.
మరి, జనం సొమ్ముతో అమలు చేయబడే సంక్షేమ పథకాలకి ఆ జీతగాళ్ళ పేర్లెందుకు.? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.
ప్రశ్నిస్తే ప్రజలు ప్రభువులవుతారు.. కానీ, ప్రశ్నించడం మర్చిపోయి, బానిసత్వానికి అలవాటు పడ్డారు కదా.! సంక్షేమం అనేది బిచ్చంగా మారిపోయిందంటే.. ప్రజల్ని పాలకులు బిచ్చగాళ్ళుగా మార్చేశారనే అర్థం.!
ప్రజలు కష్టపడితేనే ప్రభుత్వ ఖజానా నిండుతుంది.. ఆ ఖజానా నుంచే అభివృద్ధి జరగాలి.. అదీ సమానంగా.! అభివృద్ధి ఫలాలైనా, సంక్షేమ ఫలాలైనా ప్రజలందరికీ సరిసమానంగా అందాలి.! అందుతాయా.?