Table of Contents
Jagan Chandrababu Slipper Shot.. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుతో కొట్టారట.!
ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతవరకు ఈ విషయమై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పెదవి విప్పింది లేదు.
కాలేజీ రోజుల్లో, చంద్రబాబుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారనీ, అప్పటి నుంచి కక్ష పెంచుకుని, ఇప్పుడు చంద్రబాబు, బదులు తీర్చుకుంటున్నారన్నది జగన్ ఆరోపణ.
Jagan Chandrababu Slipper Shot.. చంద్రబాబుకి అధికారం కొత్తేమీ కాదు కదా..
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. విభజన తర్వాత, ఐదేళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
గత ఏడాదిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకవేళ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నిజంగానే, చంద్రబాబుని కొట్టి వుంటే, చంద్రబాబు బదులు తీర్చుకోవాలనుకుంటే.. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే, అది జరిగిపోయేది.
చంద్రబాబు, పెద్దిరెడ్డి.. దాదాపుగా రాజకీయాల్లో సమకాలీకులే. సో, కక్ష తీర్చుకోవాలనుకుంటే, చంద్రబాబు అదెప్పుడో చేసేసేవారు.
దుష్ప్రచారమా.? మైండ్ గేమ్ ఆడుతున్నారా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారం కోల్పోయాక, జగన్ మానసిక పరిస్థితి అస్సలేం బాలేదు.. అందుకే, ఇదంతా.. అన్నది ఓ వాదన.
చంద్రబాబుపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారన్నది సుస్పష్టం. జగన్ మైండ్ గేమ్ ఆడినా, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.
ఎందుకంటే, చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆరోపణల్ని వైసీపీ నేత అయిన పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఇంతవరకు సమర్థించలేదు.
లిక్కర్ స్కామ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టయి, జైల్లో వున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కొట్టిన వ్యవహారం నిజమే అయితే, పెద్దిరెడ్డి ఎప్పుడో ఈ విషయం బయటపెట్టేవారు.
జగన్ డ్రామా వల్ల నష్టపోయేది వైసీపీనే..
‘చంద్రబాబుని పెద్దిరెడ్డి కాలేజీ రోజుల్లో చెప్పుతో కొట్టారు’ అని వైఎస్ జగన్ పదే పదే వ్యాఖ్యానించడం వల్ల కలిగే నష్టం వైసీపీకే ఎక్కువ.
సభ్య సమాజంలో వైసీపీని వైఎస్ జగన్ ఇలాంటి వ్యాఖ్యలతో మరింతగా పలచన చేసేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలతో చంద్రబాబు మీదనే సింపతీ పెరిగే అవకాశం వుంటుంది.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం వున్న చంద్రబాబు మీద, ఈ తరహా ‘లేకి’ వ్యాఖ్యలు చేసే జగన్‌ని ‘లేకి పొలిటీషియన్’ అని జనం అనుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం.
రాజకీయ విమర్శలు రాజకీయాల్లో మామూలే. కానీ, ఈ వ్యక్తిత్వ హననం ఏంటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పార్టీ ముఖ్య నేతలు తగిన సలహాలు ఈ విషయంలో ఇవ్వలేకపోతున్నారా.?
పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ స్టార్’ అని వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వైసీపీ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటి.
ఇప్పుడిక, ఈ ‘చెప్పు’ వ్యాఖ్యలతో వైసీపీ పతనం ఏ స్థాయికి దిగజారిపోతుందో ఏమో.!