Jana Hridaya Senani.. అన్నదమ్ముల మధ్య అస్సలు పొసగడం లేదట కదా.! పవన్ కళ్యాణ్ రాజకీయం చిరంజీవికి అస్సలు నచ్చడంలేదట కదా.!
ఎన్నెన్నో గాలి వార్తలు.. ఇంకెన్నో పుకార్లు.! ఇవన్నీ సృష్టిస్తోన్నది కొందరు పనికిమాలినోళ్ళు మాత్రమే.! నిజానికి, వాళ్ళకది రాజకీయంగా ఓ బతుకు తెరువు.! మీడియాదీ అదే దుస్థితి.!
మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలో ‘ఇంకోలా’ ఆలోచించేందుకు ఆస్కారమే వుండదు. ఎందుకంటే, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడన్నది అన్నయ్య చిరంజీవికి కాక ఇంకెవరికి తెలుస్తుంది.?
Jana Hridaya Senani.. మేమిద్దరం రైలు పట్టాల్లాంటివాళ్ళం.!
చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పారు, తన తమ్ముడి గురించి.! ‘మేం రైలు పట్టాల్లాంటోళ్ళం.. మా గమ్యం ఒకటే. కాకపోతే, మా ఆలోచనలు వేరే వేరే మార్గాల్లో వెళుతుండొచ్చు..’ అని చిరంజీవి చెప్పడం విన్నాం.

‘నా తమ్ముడికి నా మద్దతు ఎప్పుడూ వుంటుంది..’ అని చిరంజీవి (Mega Star Chiranjeevi) ఎన్నిసార్లు చెబుతున్నా, ‘చిరంజీవి వేరు, పవన్ కళ్యాణ్ వేరు..’ అనే పుకార్లు అయితే ఆగవ్.!
‘మా అన్నయ్య అంటే, నాకు తండ్రి సమానుడు’ అని పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పదే పదే చెబుతున్నా, ఓ సెక్షన్ మీడియా దుష్ప్రచారం కొనసాగుతూనే వుంటుంది.
జన హృదయ నేత.. జనసేనాని.!
పవన్ కళ్యాణ్‌ని జన హృదయ సేనానిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఆ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్వంగా వుంది..’ అంటూ పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.
అంతే కాదు, ‘జన హితమే లక్ష్యంగా వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ’ అని పేర్కొంటూ చిరంజీవి, తన తమ్ముడ్ని ఆశీర్వదించారు కూడా.
Also Read: చంద్రయాన రాజకీయం.! నవ్విపోదురుగాక.!
అందలమెక్కాక.. అవసరం తీరాక.. తల్లినీ, చెల్లినీ.. తరిమేసే రాజకీయ నాయకులున్నారు.. అలాంటోళ్ళ నుంచి అన్నదమ్ముల్ని విడదీసే రాజకీయాలు కాక.. పద్ధతైన రాజకీయాల్ని ఎలా ఆశించగలం.?
రాజకీయమంటే కొందరికి డబ్బు సంపాదించుకోవడానికి చక్కని వేదిక. కానీ, ఇంకొందరికి అది బాధ్యత.! ఆ బాధ్యతని భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ తన తమ్ముడైనందుకు చిరంజీవి గర్వపడటంలో వింతేముంది.?