Jana Sainiks Political Sensation.. అసలు జన సేన పార్టీ, రాజకీయాల్లో మనుగడ సాధించగలుగుతుందా.?
పోటీ చేసిన రెండు చోట్లా అధినేత స్వయంగా ఓడిపోయాక, ఇక కష్టం.. అనుకున్నారు చాలామంది.!
కానీ, అక్కడున్నది పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan Konidala).! సినిమాల్లోనూ సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా సాగింది పవన్ కళ్యాణ్ కెరీర్.!
క్రియా శీలక సభ్యత్వం.. అంటే, కార్యకర్తలకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం కూడా.! దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, కార్యకర్తల సంక్షేమాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ బాధ్యతగా తీసుకున్నారు. ఇందుకోసం, నామ మాత్రంగా, కార్యకర్తల నుంచి 500 రూపాయలు వసూలు చేసి, దానికి అదనంగా తన స్వార్జితం నుంచి కోట్లాది రూపాయలు చెల్లించి ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు జనసేనాని.
Mudra369
రాజకీయాల్లోనూ అంతే.! బౌన్స్ బ్యాక్.. అనేది ఎవరూ ఊహించని రేంజ్‌లో జరిగింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన విజయం సాధించింది.
Jana Sainiks Political Sensation.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
కట్ చేస్తే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Konidala) బాధ్యతలు స్వీకరించారు. ఇకనేం, జనసైనికుల్లో కొత్త ఉత్సాహం షురూ అయ్యింది.

ఆ ఉత్సాహంలోనే, జనసేన పార్టీ (Jana Sena Party) క్రియా శీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా, రికార్డు స్థాయిలో 10 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి.
10 లక్షల సభ్యత్వాలు పూర్తయిన దరిమిలా, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంకొన్ని రోజులు పొడిగిస్తూ జనసేన పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
యాభై లక్షలు.. సాధ్యమేనా.?
పన్నెండు లక్షలో, పదిహేను లక్షలో.. ఆ పైనో, ఈ దఫా జన సేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరింత పెద్ద సంచలనాల్ని చూడబోతున్నాం.
కొందరు కార్యకర్తలు సభ్యత్వ రుసుము చెల్లించలేని పరిస్థితుల్లో వుంటే.. తోటి జనసైనికులు, వారి తరఫున ఆ సభ్యత్వ రుసుము కూడా చెల్లించేందుకు ముందుకొస్తుండడం గమనార్హం.
Mudra369
2029 ఎన్నికల నాటికి యాభై లక్షల క్రియా శీలక సభ్యులు జనసేన పార్టీకి వుంటారన్నది ఓ అంచనా. అదే లక్ష్యంతో జనసేన పార్టీ, తనదైన వ్యూహాల్ని రచిస్తోంది.
Also Read: ‘రేట్లు’ పెంచితే.. తాగడం, వాగడం మానేస్తారా.!?
అనుకున్నట్టుగానే, యాభై లక్షలకు పై చిలుకు క్రియా శీలక సభ్యుల్ని జనసేన పార్టీ గనుక సంపాదించగలిగితే, తెలుగు రాష్ట్రాల్లో ఇదో సంచలనం కాబోతోంది.. రాజకీయంగా.