Janasena BJP Telanga Politics.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. దాదాపు 32 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటోంది.
వాస్తవానికి బీజేపీకి జనసేన మిత్రపక్షం. అయితే, తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా వుంది.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ, తన దారి తాను చూసుకుంది. అయితే, టీడీపీతో ఈ మధ్య కొత్తగా ఏర్పడ్డ స్నేహంతో జనసేన – టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
Janasena BJP Telanga Politics.. ఊహించని పరిణామమే ఇది..
ఇంతలోనే, తెలంగాణ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరో బీజేపీ ముఖ్య నేత లక్ష్మణ్ తాజాగా జనసేన అధినేతతో భేటీ అయ్యారు.
తమకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ని కోరారు. కలిసి పోటీ చేద్దామనీ సూచించారు.

పార్టీ ముఖ్య నేతలతో ఈ విషయమై కలిసి చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలతో చెప్పారు.
దుష్ప్రచారం షరా మామూలే..
అయితే, తెలంగాణలో పోటీ చేయొద్దని చెప్పడానికే పవన్ కళ్యాణ్‌తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారన్న దుష్ప్రచారానికి తెరలేపారు కొందరు.
కాగా, తెలంగాణలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా, జనసేనతో సఖ్యతనే కోరుకుంటోందిగానీ, అధికారికంగా ఈ విషయమై గులాబీ పార్టీ నేతలు ఇప్పటిదాకా స్పందించలేదు.
Also Read: ప్రకాష్ రాజ్‌కి ఝలక్ ఇచ్చిన కంగనా రనౌత్.!
సో.. తెలంగాణ రాజకీయాల్లోనూ జనసేన కీలక పాత్ర పోషించబోతోందట. అయితే, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.? ఎవరితో కలిసి పోటీ చేస్తుంది.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
ఇదిలా వుంటే, ఏపీలో బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ వుందన్న ప్రచారానికి, ఈ తెలంగాణ రాజకీయం చెక్ పెట్టినట్లయ్యింది. ఏపీలోనూ బీజేపీ – జనసేన – టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు పెరిగాయిప్పుడు.!