Janasena For New Age Politics: గెలవడానికి ఇది రన్నింగ్ రేసు కాదు.! ఎవరో గెలిస్తే, ఇంకెవరో ఓడితే.. ఆ నెంబర్ల రేసు పట్టుకుని రాజకీయాలకు పనికొస్తారనో, పనికిరారనో తేల్చేస్తారా.? అసలు రాజకీయమేంటి.? ఇప్పుడున్న రాజకీయమేంటి.?
ఓ మనిషి ఇంకో మనిషిని నమ్మితే, తనను నమ్మినోడి కోసం ఏమైనా చేయడం మానవత్వం. ఓ సమూహం తనను నమ్మకున్నప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకుు కష్టపడితే.. అది సేవ.! అలా సేవ చేయగలిగేవాడే నాయకుడు.! రాజకీయమంటే నిజానికి సేవ. కానీ, రాజకీయమంటే ఇప్పుడు దానర్థం మారిపోయింది.
Janasena For New Age Politics గబ్బుపట్టిన రాజకీయాల్లో ప్రక్షాళన అవసరం.!
సినిమాల్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చి, ఈ గబ్బు రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదని తెలుసుకుని, తనకు ప్రధాన ఆర్థిక వనరు అయిన సినిమాల్లోకి తిరిగెళ్ళి.. ఇటు రాజకీయం అటు సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోవడమంటే చిన్న విషయం కాదు.
‘రెండు చోట్లా ఓడిపోయావ్..’ అని రాజకీయ ప్రత్యర్థులు వెటకారం చేస్తోంటే, ‘అది ఓడిపోవడం కాదురా వెధవల్లారా.! నేను గెలవాలని వేల మంది, లక్షల మంది కోరుకున్నారు.. వాళ్ళంతా మీరు పంచే డబ్బులకి కక్కుర్తి పడనోళ్ళు.!’ అని చెప్పగలిగే ధైర్యం జనసేనాని పవన్ కళ్యాణ్‌కి (Jana Sena Party Chief Pawan Kalyan) మాత్రమే వుంది.
గడచిన ఎనిమిదేళ్ళలో జనసేన పార్టీ ఏం సాధించింది.? అంటే, పార్టీ అధికారంలో వున్నా లేకున్నా.. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా.. అక్కడ జనసేన జెండా కనిపిస్తోందే.. అదే జనసేన సాధించింది. వరదలొచ్చినా, ఇంకే విపత్తు వచ్చినా, జనసేన చేసే సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారే.. అదీ జనసేన (Janasena) సాధించింది.
పవన్ కళ్యాణ్ అంటేనే నమ్మకం.!
నిరుద్యోగులైనా, రైతులైనా, మరొకరైనా.. తమ సమస్యల పరిష్కారం కోసం.. తమ ఆవేదనను ప్రపంచానికి ఎలుగెత్తి చాటతాడన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ వద్దకు పరుగులు పెడుతున్నారంటే.. అది కదా.. ఆ నమ్మకాన్ని గెలుచుకున్నాడు జనసేనాని.!
ఓడి గెలవడం అంటే ఇదీ.! గెలిచాక, జనానికి మొహం చూపలేకపోవడాన్ని.. గెలిచి ఓడటం అంటారు.! దానికీ దీనికీ చాలా తేడా వుంది.!
రేప్పొద్దున్న గెలుస్తామో లేదో తెలియదు.. కానీ, ప్రజల కోసం అండగా నిలబడాల్సిన బాద్యత తమ మీద వుందని జనసైనికులు గట్టిగా నమ్ముతున్నారే.. అదీ గెలుపంటే.! అలా వారిలో నమ్మకాన్ని నింపడం నాయకత్వమంటే.! ఇదీ రాజకీయమంటే.!
Also Read: Pawan Kalyan హీరోయిజంపై ఎందుకీ ‘ఏడుపు’.!
నిజమైన రాజకీయానికి చీడ పట్టింది.. వ్యవస్థల్ని అది నాశనం చేస్తోంది.. సమాజాన్ని పట్టి పీడిస్తోంది.! ఆ రోగానికి చికిత్స ‘మార్పు’తోనే. మార్పు మొదలైంది.. కాకపోతే, కొంచెం నెమ్మదిగా.!
ఏ రాజకీయ చీడకి తాము బలైపోయామన్నది జనం గుర్తిస్తున్నారు.. ఈ చీడని ‘మార్పు’ అనే ఆయుధంతోనే వదిలించాలి.! ఈలోగా ఎవరెంతలా మొరిగినా, జనం కోసం జనసేన అన్నది నిష్టురసత్యం.