Janasenani Pawan Kalyan Agenda.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు.
‘మనం 40 సీట్లు అయినా గెలిస్తే కదా, ముఖ్యమంత్రి పదవి అడిగే స్థాయికి రగలం..’ అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు జనసేన అధినేత. ఇందులో తప్పేముంది.?
రాజకీయాలన్నాక.. పొత్తులు సర్వసాధారణం. ఒంటరిగా బరిలోకి దిగాలా.? వేరే పార్టీల్ని కలుపుకుపోవాలా.? అన్నది అప్పటికి వున్న రాజకీయ పరిస్థితులను బట్టి వుంటుంది.
Janasenani Pawan Kalyan Agenda.. యజమానిపై పాలేరుతనమెవరిది.?
పవన్ కళ్యాణ్ జెండా.. ఎజెండా.. అన్నీ స్పష్టంగానే వున్నాయి. డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టకూడదన్నది జనసేన ఎజెండా.! ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది జనసేన సిద్ధాంతం.!
ఇందులో పాలేరుతనం ఏముంటుంది.? జెండా, ఎజెండా లేని నాయకులు.. పూటకో పార్టీ మార్చడం పాలేరుతనం అవుతుందిగానీ.. సొంత జెండా, ఎజెండా వున్న నాయకుడు పాలేరు ఎలా అవుతాడు.?
అంతిమ నిర్ణేతలు ప్రజలే.!
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఎవర్ని గెలిపించాలి.? ఎవర్ని ఓడించాలి.? అన్నది ప్రజల విచక్షణ మీద ఆధారపడి వుంటుంది.
ఓట్ల పండగ అయిపోయాక.. ప్రజల జీవితాలు, అంతకు ముందు ఆ ప్రజలు ఎవర్ని నమ్మారన్నదానిపై ఆధారపడతాయి.
ఐదేళ్ళకోసారి కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజలకు వుంటుంది. ఇంకోసారి గోతిలో పడాలని ప్రజలు అనుకుంటే.. అది వారి విచక్షణ.! దానికి తగ్గట్టుగానే పాలన కూడా వుంటుంది.! ప్రజల జీవితాలూ ఆధారపడి వుంటాయ్.!