Janasenani Pawan Kalyan.. స్వాతంత్ర్యం నాయకుల ద్వారా రాలేదు.. ప్రజలే స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సి వచ్చింది.!
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది కూడా ప్రజలే.! ప్రజా నాయకుడిగా నన్ను గెలిపించుకోవాల్సింది కూడా ప్రజలే.!
ఓ రాజకీయ నాయకుడికి ఎలాంటి స్పష్టత వుండాలో.. అలాంటి స్పష్టత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వుంది.
గెలిచినోడు.. ‘రాజకీయ నిరుద్యోగులకి’ సలహాదారులనీ, ఇంకోటనీ పదవులిచ్చి, ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని అర్థం చేసుకోలేని అమాయకులా ప్రజలు.?
Mudra369
‘మా నాన్న చచ్చిపోయారు.. నన్ను గెలిపించండి..’ అని పవన్ కళ్యాణ్ అడగలేదు కదా.! ‘నన్ను ముఖ్యమంత్రిని చేయండి..’ అని పవన్ కళ్యాణ్ అనడంలేదు కదా.!
Janasenani Pawan Kalyan గెలిపించుకోవాల్సింది ప్రజలే..
ఔను, ప్రజలే నాయకుడ్ని గెలిపించుకోవాలి. ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సింది ప్రజలే. ఎన్నికల్లో ఓట్లేసేటప్పుడు, కరెన్సీకి కక్కుర్తి పడకూడదని ఆ ప్రజలే అనుకోవాలి.
రాజకీయ పార్టీల సభలకు వెళ్ళేటప్పుడు, నాయకులు తమని ఉద్దేశించి ఏం మాట్లడతారు.? అని ఆలోచించాలి తప్ప, ‘రోజు కూలీ’ అన్న చందాన, కూలీ కోసం రాజకీయ సభలకు వెళ్ళకూడదు.

నన్ను గెలిపిస్తే మంచి పరిపాలన ఇస్తాను.! నన్ను ఓడిస్తే, మీ కోసం మరింత బలంగా నిలబడతాను.! ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నమాట.
ఓడినోడే.. ఆదుకుంటున్నాడు..
నిజమే కదా.! ఆ ఓడినోడే కౌలు రైతుల కుటుంబాలకు స్వార్జితాన్ని వెచ్చించి సాయం అందిస్తున్నాడు. ఆ ఓడినోడి దగ్గరకే, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళుతున్నారు.
ఓ పోలీసన్నా.! నువ్వెవరికి సెల్యూట్ చేస్తున్నావో తెలుసా.? ముఖ్యమంత్రికి కాదు.! ఖైదీ నెంబర్ 6093కి.!
Mudra369
ఈ మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలకు కారణమవుతోంది..
ఒక నాయకుడు నిస్వార్ధంగా చెప్పే ఈ మాటల్లోని స్పష్టత ప్రజలకు అర్థమైపోతే, కుహనా రాజకీయ నాయకులకు ఈ ప్రజాస్వామ్యం నుంచి గెంటివేత తప్పదు.
అందుకే, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలతో దాడి చేయాలి. అంతే తప్ప, పవన్ కళ్యాణ్.. ప్రజల తరఫున సంధించే ఏ ప్రశ్నకైనా అధికారంలో వున్నవారు సమాధానం చెప్పగలరా.? ఛాన్సే లేదు.
Also Read: రెమ్యునరేషన్ రచ్చ: గూబ గుయ్యిమనిపించిన మెగాస్టార్ చిరంజీవి
గెలిచినోడు.. ‘రాజకీయ నిరుద్యోగులకి’ సలహాదారులనీ, ఇంకోటనీ పదవులిచ్చి, ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని అర్థం చేసుకోలేని అమాయకులా ప్రజలు.?