అతిలోక సుందరికి ఇద్దరు కూతుళ్ళు. ఒకరు జాన్వీ కపూర్.. ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసేసింది. ఖుషీ కపూర్ కూడా తెరంగేట్రానికి సిద్ధమయ్యింది. ఇప్పటిదాకా జాన్వీ కపూర్ గ్లామర్ షో చూశాం. ఇకపై ఖుషీ కపూర్ గ్లామర్ షో (Janhvi and Khushi Kapoor Glamorous Show) చూడబోతున్నాం.
శ్రీదేవి అంటే, కేవలం అందాల తార కాదు.. అంతకు మించి ఆమె చాలా మంచి పెర్ఫామర్. నటిగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది అతిలోక సుందరి శ్రీదేవి. తన కుమార్తెలు హీరోయిన్లుగా వెండితెరపై వెలిగిపోవాలని, ఆ ముచ్చట తన కళ్ళారా వీక్షించాలని శ్రీదేవి చాలా కలలు కనేసింది.
Also Read: జాన్వీ కపూర్.! ఇంకెన్నాళ్ళిలా ఊరిస్తావ్.?
కానీ, అర్ధాంతరంగా తనువు చాలించింది అతిలోక సుందరి. దాంతో, తన తల్లి కన్న కలల్ని నిజం చేయాల్సిన బాధ్యతని ఓ యజ్ఞంలా భావిస్తున్నారు శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. తెరంగేట్రం చేస్తూనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). మంచి మంచి కథల్ని ఎంచుకుంటూ జాన్వీ హిందీ సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఇప్పుడిక ఖుషీ వంతు. అక్కకి తానేం తీసిపోనని ఖుషీ కపూర్ నిరూపించడానికి సిద్ధమయ్యింది. అప్పుడే హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారుకి మతులు పోగొట్టేస్తోంది. నటనలో ఇప్పటికే శిక్షణ తీసుకున్న ఖుషీ కపూర్, తన తల్లి శ్రీదేవి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత అక్కతోపాటు తన మీద కూడా వుందని చెబుతోంది.
Also Read: జాన్వీ పాపకి దెయ్యమంటే ‘భయం’ అట.!
అక్క.. అక్కకు మించిన చెల్లెలు.. అంటూ జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Khushi Kapoor) ల గ్లామర్ షో గురించి అప్పుడే సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. సినిమా అంటేనే గ్లామర్.. ఆ గ్లామర్ ప్రపంచంలో ఆ మాత్రం గ్లామరస్ షో (Janhvi and Khushi Kapoor Glamorous Show) చెయ్యకపోతే ఎలా.? అన్నది జాన్వీ, ఖుషీ కలిసి చెబుతున్నమాట.
ఇంతకీ, ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లలో ఎవరు వెండితెరపై గ్లామరస్ విన్నర్ అవుతారట.?