Janhvi Kapoor Brand Value.. ఒక్క సినిమా తేడా కొడితే.. అంతే సంగతులు.! కెరీర్ డల్ అయిపోతుంది, ఆ తర్వాత గ్లామర్ ప్రపంచానికి దూరమవ్వాల్సి వస్తుంది.
చాలామంది అందాల భామల విషయంలో ఇదే జరిగింది. కానీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ వ్యవహారం వేరు.!
ఫ్లాపులొచ్చినా, జాన్వీ కపూర్ రేంజ్ మాత్రం రోజు రోజుకీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది.
జాన్వీ కపూర్ చేస్తున్న సినిమాలు, ఆమెకు పెరుగుతున్న రెమ్యునరేషన్.. బాలీవుడ్ ట్రేడ్ పండితుల్నే ఆశ్చర్యపరుస్తోంది.
Janhvi Kapoor Brand Value.. జాన్వీ కపూర్.. ఓ బ్రాండ్.!
జాన్వీ కపూర్ చేతిలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆడిపాడుతోంది జాన్వీ కపూర్.
ఈ సినిమా తర్వాత, మరో రెండు ప్రెస్టీజియస్ ఫిలింస్ తెలుగులోనే వున్నాయి జాన్వీ కపూర్‌కి. వాటి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Also Read: పిచ్చోడితో ఐపీఎస్ ‘సూసైడ్ ఆపరేషన్’.!
ఈ కారణంగానే, జాన్వీ కపూర్ పేరు ఓ బ్రాండ్ అయిపోయింది. బ్రాండ్ అంబాసిడర్‌గా పలు ప్రోడక్టులకు పనిచేస్తున్న జాన్వీ కపూర్, కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ధీటుగా, జాన్వీ కపూర్ ‘బ్రాండ్ అంబాసిడర్’ కేటగిరీలో రెమ్యునరేషన్ దక్కించుకుంటుండడం మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.
