అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. తన తల్లిలానే ‘డెడికేషన్’కి కేరాఫ్ అడ్రస్. పాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడతానంటోంది ఈ బ్యూటీ. మొదట్లో కాస్త బొద్దుగా కన్పించినప్పటికీ, జాన్వీ.. (Janhvi Kapoor Cheese Cake Story) క్రమక్రమంగా జీరో సైజ్ ఫిజిక్.. అనే స్థాయికి తనను తాను మలచుకుంది.
జీరో సైజ్ పట్ల మరీ తనకు అంత మక్కువ లేదంటూనే, కఠినతరమైన వర్కవుట్లు చేసేసి.. తన శరీరాన్ని తనక్కావాల్సిన విధంగా మార్చేసుకుంది. సరైన ఫిజిక్ వుంటే, ఎలాంటి డాన్సులు చేసినా.. వాటికి అందం వస్తుందనేది జాన్వీ కపూర్ గట్టి నమ్మకమట.
తన తాజా చిత్రం ‘రుహి’ కోసం జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఓ ప్రత్యేకమైన పాట కోసం.. ప్రత్యేకంగా డాన్స్ చేయడమే కాదు, ప్రత్యేకంగా వర్కవుట్లు చేసి, డైట్ కంట్రోల్ కూడా చేసేసి.. ఎలాగైతేనేం, అనుకున్నది సాధించేసింది. జాన్వీ కపూర్ సాంగ్ అదిరిపోయింది.
ఈ విషయాన్ని చెబుతూ, సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది జాన్వీ కపూర్. ‘నా కోసం ఛీజ్ కేక్ ఎదురుచూస్తోంది..’ అంటూ జాన్వీ కపూర్ ఆ ఫొటోలతోపాటు స్టన్నింగ్ కామెంట్ పోస్ట్ చేయడం గమనార్హం. చీజ్ కేక్ అంటే జాన్వీ కపూర్‌కి చాలా చాలా ఇష్టం.
కానీ, ‘రుహి’ (Roohi) కోసం తనకిష్టమైన ఛీజ్ కేక్‌ని పక్కన పెట్టేసింది. ‘రుహి’ పనైపోవడంతో.. ఎంచక్కా జాన్వీ కపూర్ తనకిష్టమైన ఛీజ్ కేక్‌తో (Janhvi Kapoor Cheese Cake Story) పండగ చేసేసుకుందన్నమాట. తెరపై గ్లామరస్‌గా కన్పించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదనీ, కొందరు తమ హాట్ ఫొటోల్ని దారుణంగా ట్రోల్ చేస్తుంటే బాధ కలుగుతుందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
బాగా కష్టపడ్డాక, ఫలితం అద్భుతంగా వస్తే.. ఆ ‘కిక్’ ఇంకో లెవల్‌లో వుంటుందన్నది జాన్వీ నమ్మకం. ఎన్ని సినిమాలు చేసినా, తన తల్లిని మ్యాచ్ చేయలేననీ, ఆమెకు చెడ్డపేరు రాకుండా వుండటానికి తనవంతు కష్టపడతాననీ జాన్వీ అంటోంది.