Table of Contents
అతిలోక సుందరి, అలనాటి మేటి నటి దివంగత శ్రీదేవికి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి పరిచయమైంది ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ (Janhvi Kapoor).
ఇంతవరకూ సౌత్ సినిమాల్లో నటించింది లేదు కానీ, సౌత్‌లోనూ జాన్వీకి బోలెడంత క్రేజ్.
తన అందాల మాయాజాలంతో సోషల్ మీడియాలో కనీ వినీ ఎరుగని పాపులారిటీ దక్కించుకుంది జాన్వీ కపూర్. గ్లామర్‌లో జాన్వీని కొట్టేవాళ్లే లేరన్నంతగా అందాలతో దాడి చేస్తుంటుంది.
అలా అని కేవలం అందానికే పరిమితం కాదండోయ్. తల్లికి తగ్గ తనయ. యాక్టింగ్‌లోనూ తనదైన ముద్ర వేసుకుంది. అందాల ఆరబోత కేవలం సోషల్ మీడియా వరకే.
Janhvi Kapoor.. నో గ్లామర్ ఓన్లీ టాలెంట్.!
తెరపై అందాలకు అస్సలు తావివ్వదు జాన్వీ కపూర్. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటుంది. జాన్వీ సినిమాల్లో ఖచ్చితంగా ఏదో విషయముంటుంది అనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.
ఒక్కసారి జాన్వీ తన పాత్రలో లీనమైతే, ఇంక అంతే పరకాయ ప్రవేశమే. తెరపై పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంత నేచురల్‌గా నటనకు కనెక్ట్ అయిపోయింది జాన్వీ కపూర్.
ఎంతైనా ఆ మహానటి తనయ కదా. ఆమె లెగసీని నిలబెట్టేందుకు చాలా కష్టపడుతోంది. రీసెంట్‌గా ‘మిలి’ సినిమాలో జాన్వీ నటన చూస్తే ఆమెని ఇష్టపడని వాళ్లుండరంటే, అతిశయోక్తి కాదేమో.
బ్యూటీ ఆఫ్ డెడికేషన్..
అంత అద్భుతమైన నటన కనబరిచింది ఆ సినిమాలో. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ సినిమాని వీక్షించారంటే, అది కేవలం జాన్వీ నటన వల్లే సాధ్యమయ్యిందని చెప్పొచ్చు.

‘మిలి’ మాత్రమే కాదండోయ్, అంతకు ముందు ‘గుడ్ లక్ జెర్రీ’ కావచ్చు.. ‘గుంజన్ సక్సేనా’ కావచ్చు.. ఇలా ఏ సినిమా తీసుకున్నా జాన్వీ కపూర్ కనిపించదు. తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంతలా కట్టి పడేస్తుంటుంది.
‘ధడక్’.. తొలి సినిమాకే నటిగా జాన్వీ మామూలుది కాదు సుమా.! అనిపించుకుంది. తొలి సినిమాకే అంత మెచ్యూరిటీనా.! అని అవాక్కయ్యేలా చేసింది జాన్వీ తన నటనతో.
ట్రెడిషనల్ లుక్స్‌లో జాన్వీ సొగసు చూడతరమా.!
బాలీవుడ్‌లో చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా వుండే జాన్వీ కపూర్, క్షణం తీరిక లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది.
హాట్ హాట్ గ్లామ్ షూట్స్‌తో నెటిజన్లను పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా గోల్డెన్ కలర్ ట్రెడిషనల్ వేర్‌లో జాన్వీ కపూర్ చేస్తున్న క్యూట్ గ్లామర్ హల్ చల్ అంతా ఇంతా కాదు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
Also Read: Ketika Sharma: టిల్లుగాని గర్ల్ ఫ్రెండ్ అట.!
ఇక త్వరలోనే టాలీవుడ్‌లోనూ జాన్వీ తొలి అడుగులు మొదలు కానున్నాయ్. ఎన్టీయార్ 30 సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఎప్పుడెప్పుడు జాన్వీని తెలుగు తెరపై చూస్తామా.? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నటాలీవుడ్ ప్రేక్షకుల ఆ కోరిక తీరే రోజు ఇప్పటికైనా వచ్చిందేమో చూడాలిక.