Janhvi Kapoor.. తెలుగు సినిమాల్లో జాన్వీ కపూర్ ఎప్పుడు నటిస్తుంది.? అన్న ఉత్కంఠకు తెరపడటంలేదు. అసలామె తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వుందో లేదో కూడా తెలియడంలేదాయె.!
మామూలుగా అయితే, జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో నటిస్తే ఎవరిక్కావాలి.? నటించకపోతే ఎవరిక్కావాలి.?
కానీ, ఆమె ‘అతిలోక సుందరి’ శ్రీదేవి కుమార్తె. అందుకే, జాన్వీ తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని కొందరు ఎదురుచూస్తున్నారు.
జాన్వీ కపూర్ మాత్రం, తెలుగు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శ్రీదేవి జీవించి వుంటే గనుక ఖచ్చితంగా జాన్వీ కపూర్ ఈపాటికి ఓ తెలుగు సినిమా అయినా చేసేసి వుండేదేమో.!
Janhvi Kapoor టాలీవుడ్ ఎంట్రీకి అడ్డుపడుతున్నదెవరు.?
కాగా, జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్.. తన కుమార్తె తెలుగు సినిమా చేయడం పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదట. ఆ కారణంగానే టాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ అన్నీ తిరస్కరణకు గురవుతున్నాయట.

తాజాగా, ‘జన గణ మన’ సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్, జాన్వీ కపూర్ పేరుని పరిశీలిస్తే, అందుకు జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే ప్రచారం జరుగుతోంది.
అంతకు ముందు జాన్వీ కపూర్ ‘విజయ్ దేవరకొండ’ హీరోగా తెరకెక్కనున్న ‘జన గణ మన’ సినిమాకి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: నిహారిక కూడా మీ ‘ఆడకూతురు’ లాంటిదే కదా.!
ఈ వార్తల్ని జాన్వీ కపూర్ ఖండించింది. తెలుగు సినిమాలు చేయడంలేదనేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే వుందని జాన్వీ కపూర్ స్పష్టం చేసింది.