Janhvi Kapoor Tollywood Entry: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై.. అందునా తెలుగు తెరపై తెరంగేట్రం విషయమై జరుగుతున్న ప్రచారాలు కేవలం గుసగుసలకే పరిమితమవుతున్నాయా.?
సౌత్‌లో సినిమాలు చేయడంపై జాన్వీ కపూర్ నిజంగానే ఇంట్రెస్ట్ చూపించడం లేదా.? లేక ఇంకేమైనా బలమైన కారణాలున్నాయా.? అనే చర్చ ఎప్పటికప్పుడే హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా మరోసారి జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ సోదిలో నిలిచింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, జాన్వీ తండ్రి అయిన బోనీ కపూర్‌ని ఈ విషయమై ఎప్పుడు అడిగినా.. మంచి ఛాన్స్ వస్తే, తెలుగు, తమిళ సినిమాల్లో నటించేందుకు జాన్వీ ఎప్పుడూ సిద్ధమే.. అంటూ రొటీన్ స్టోరీ చెబుతున్నాడు.
Janhvi Kapoor Tollywood Entry తూచ్.! అదంతా ఉత్తదే..
ఇదిగో ఆ సినిమాతో జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందట.. అదిగో ఆ హీరోతో జాన్వీ తెలుగు ఎంట్రీ షురూ అట.. అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రూమర్స్ పుట్టుకొస్తూనే వున్నాయ్. మొన్నామధ్య ఎన్టీయార్ సినిమాలో జాన్వీ హీరోయిన్ అట.. అంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది.

చరణ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో అంతకు ముందే ఆ ప్రయత్నాలు జరిగాయంటూ మరిన్ని గుసగుసలు వినిపించాయ్. అయితే బోనీ కపూర్ (Boney Kapoor) మాత్రం ఈ రూమర్స్‌ని సింపుల్‌గా ఖండిస్తున్నారు.
అలాంటి ఆఫర్లేమీ తమ వద్దకు రాలేదని చెబుతూ, సోషల్ మీడియాలో ఆ రూమర్స్ తానూ చూశాననీ, వాటిలో ఎంత మాత్రమూ నిజం లేదని తేల్చేశారు.
శ్రీదేవి బతికుంటే ఇలా జరిగేనా.?
మరోవైపు బోనీ కపూర్, సౌత్‌లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ హీరో అజిత్‌తో ‘వాలిమై’ సినిమాని నిర్మించారు.
బోనీ కపూర్ తలచుకుంటే, జాన్వీని తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం పెద్ద పనేం కాదు. కానీ, ఎందుకు జాప్యం జరుగుతుంది.? బాలీవుడ్ భామలు అలియా భట్, శ్రద్ధా కపూర్ తదితరులు తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటప్పుడు జాన్వీ ఎందుకు ఇటు వైపు చూడలేకపోతోంది.?
శ్రీదేవి (Sridevi) బతికే వుంటే, ఎప్పుడో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వుండేది.
Also Read: కాజల్ సంచలనం: బతకండి.. బతకనివ్వండి.!
ఇదిలా వుంటే, ఒకప్పుడున్న క్రేజ్ జాన్వీకి ఇప్పుడు లేదు. బహుశా సౌత్ ఫిలిం మేకర్లు జాన్వీని లైట్ తీసుకుంటున్నారేమో కూడా. ఒకవేళ ఇదే జరిగితే, జాన్వీ (Janhvi Kapoor) ఎంట్రీని సౌత్‌లో ఇక ఊహించలేమేమో, చూడాలి మరి.