Bollywood beauty Janhvi Kapoor is making sensational headlines all because of her belly dance (Janhvi Kapoor Sizzling Belly Dance), in which she has done magical hip movements for ‘San Sannana’ song.
The Stunning actress has already proved as one of the best dancers in Bollywood with her very first film Dhadak, but this time, she has shown something special and spicy with belly dance.
Janhvi Kapoor was last seen in Gunjan Saxena – The Kargil Girl, which was released digitally on OTT platform couple of months back and bagged critics’ applause.
Now, the darling daughter of Athiloka Sundari Sridevi is very busy with her upcoming venture Good Luck Jerry, which is the official remake of Kolamaavukohila. Good Luck Cherry is being directed by Siddarth Sen Gupta.
While posting the video of belly dance in her social media handle, Janhvi Kapoor said “Missing post burrrito belly dance sessions”.
బెల్లీ డాన్స్: జాన్వీ కపూర్ చితక్కొట్టేసిందంతే..
ఎంతైనా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కదా.. డాన్సుల్లో ఆ మాత్రం ఈజ్ లేకపోతే ఎలా.? వుంది.. టన్నులకు టన్నులే వుంది డాన్సుల్లో ఈజ్ జాన్వీ కపూర్‌కి. ఇదిగో, ఇదే సాక్ష్యమంటూ తొలి సినిమా ‘ధడక్’లోనే అదరగొట్టేసింది జాన్వీ కపూర్. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది ఈ అందాల భామ.
అసలు నడుము అనేది వుందా.? లేదా.? వుంటే, నడుము స్ప్రింగులా ఎలా మారిపోయింది.? స్ప్రింగ్ కూడా కాదు, రబ్బరు బొమ్మలా మారిపోయిందంతే జాన్వీ కపూర్. తల నుంచి పాదం వరకు.. అన్ని పార్టులూ విడి విడిగా డాన్సులు చేసేశాయి.. అన్నీ లయబద్ధంగానే. ‘సన్ సనన..’ అంటూ సాగే పాటకి జాన్వీ కపూర్ బెల్లీ డాన్స్ (Janhvi Kapoor Sizzling Belly Dance) చేసేసింది.
ఇంకేముంది, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం ‘కొలమావు కోకిల’ రీమేక్ అయిన ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.