Mohanbabu University Kramasikshana.. మోహన్‌బాబు అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే మోహన్‌బాబు.. అంటూ, లేని క్రమశిక్షణని బలవంతంగా రుద్దేస్తుంటుంది ఓ వర్గం మీడియా.!
ఆ స్థాయిలో మంచు మోహన్‌బాబు కుటుంబం, మీడియా మీద ‘క్రమశిక్షణ’ పేరుతో, ఒత్తిడి తీసుకొస్తుంటుంది.
అసలంటూ ఆ క్రమశిక్షణ మంచు మోహన్‌బాబు కుటుంబంలో వుంటే, మనోజ్ – విష్ణు ఎంందుకు రోడ్డున పడి కొట్టుకుంటారు.?
సరే, అది కుటుంబ వ్యవహారం.. అనుకుందాం.! మరి, మోహన్‌బాబు యూనివర్సిటీలో అక్రమాల సంగతేంటి.? వీటి గురించే కదా, గత కొంతకాలంగా మంచు మనోజ్ ప్రశ్నిస్తున్నది.?
Mohanbabu University Kramasikshana.. క్రమశిక్షణ తప్పినందుకు జరీమానా..
తాజాగా, ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, మోహన్‌బాబు యూనివర్సిటీ ‘క్రమశిక్షణ తప్పినందుకు’గాను, జరీమానా విధించింది.
తప్పు ఒప్పుకుని, ‘క్రమశిక్షణ’ పాటిస్తూ, మోహన్‌బాబు యూనివర్సిటీ, ఆ జరీమానాని చెల్లించేయడం కూడా జరిగిపోయింది.
మొత్తంగా 26 కోట్లకు పైనే మోహన్‌బాబు యూనివర్సిటీ, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తేల్చింది.
క్రమశిక్షణ లేకుండా, అక్రమ వసూళ్ళకు పాల్పడిన మోహన్‌బాబు యూనివర్సిటీ, ఆ ఇరవై కోట్ల రూపాయల్ని, విద్యార్థులకు తిరిగి చెల్లించాలంటూ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
అంతేనా.? మోహన్‌బాబు యూనివర్సిటీ అనుమతిని రద్దు చేయాలని కూడా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్పష్టం చేయడం గమనార్హం.
ఈ క్రమంలో మోహన్‌బాబు యూనివర్సిటీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాత్కాలిక ఊరట పొందింది.
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలపై మూడు వారాల స్టే లభించింది మోహన్‌బాబు యూనివర్సిటీకి.
గత కొంతకాలంగా మోహన్‌బాబు యూనివర్సిటీ వ్యవహారాల్ని పూర్తిగా మంచు విష్ణు చూసుకుంటున్న సంగతి తెలిసిందే.
Also Read: బూతు కిట్టు ‘కుల’ పాత్రికేయ వ్యభిచారమ్.!
సోదరుడు విష్ణు హయాంలో అక్రమాలు పెరిగిపోయాయంటూ స్వయంగా మనోజ్ ఆరోపించడమే కాదు, యూనివర్సిటీలోకి వెళ్ళి లెక్కలు తీసే ప్రయత్నమూ చేశారు.
అయితే, మనోజ్ మీద విష్ణు తన అనుచరులతో దాడి చేయించడం, ఇరువురూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవడం, మొత్తం ముగ్గురికీ పోలీసులు, కౌన్సెలింగ్ ఇవ్వడం తెలిసిన సంగతులే.
‘మంచు క్రమశిక్షణ’ అంటే, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి 26 కోట్ల రూపాయలు కొట్టెయ్యడం.. అని జనం చర్చించుకుంటున్నారిప్పుడు.
