Table of Contents
Jani Master Released.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలయ్యారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నది జానీ మాస్టర్ మీద నమోదైన కేసు తాలూకు సారాంశం.
సరే, ఈ కేసు ఎప్పటికి తేలుతుంది.? అన్నది వేరే చర్చ.! కేసు విచారణ మాత్రం కొనసా..గు..తూ.. వుంటుంది.!
Jani Master Released.. ఇకపై అవకాశాలు కష్టమేనా.?
ఇంతకీ, జానీ మాస్టర్ భవిష్యత్తేంటి.? మునుపటిలా సినిమాలు చేసుకుంటూ వెళతారా.? సినీ రంగంలో ఆయన్ని ఎవరైనా తొక్కేస్తారా.?
ఓ స్టార్ హీరో, జానీ మాస్టర్ మీద కుట్రతోనే ఈ వ్యవహారమంతా ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌తో నడిపించాడన్న వాదనలున్నాయ్.
ఆ స్టార్ హీరో, జానీ మాస్టర్‌ని కెరీర్ పరంగా తొక్కేయగలడా.? అన్న అనుమానాన్ని మీడియా ముసుగులో మాఫియా నడుపుతున్న కొన్ని రోత వెబ్ సైట్లు రాతలు రాసేస్తున్నాయ్.
ఆరోపణలన్నీ నిజాలేనా.?
సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్త కావు. ఆరోపణలు చేసి, పోలీసుల్ని ఆశ్రయించినోళ్ళంతా సుద్దపూసలేం కాదు.!
‘విక్టిమ్ కార్డ్’ తెరపైకి తెచ్చి, చాలామంది జీవితాల్ని నాశనం చేసేసిన కిలేడీలు సినీ పరిశ్రమలో లెక్కలేనంతమంది వున్నారు. సో, జానీ మాస్టర్ తప్పు చేశాడని ఖచ్చితంగా చెప్పేయలేం.

ఇక, టాలెంట్ ఎక్కడుంటే అక్కడికి అవకాశాలు వెతుక్కుంటూ వెళతాయ్. సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా నిలదొక్కుకోవడానికి జానీ మాస్టర్ చాలా కష్టాలు పడ్డాడు.
ఇంకోసారి సినీ పరిశ్రమలో కష్టపడాల్సి వస్తే, ఆయనేమీ వెనకంజ వేసే రకం కాదు.! ఓ రాజకీయ పార్టీ కోసం జానీ మాస్టర్ పని చేస్తుండడం వల్లే ఈ పరిస్థితి.. అన్న అనుమానాలూ వున్నాయ్.
జనసేన మీదా.? జానీ మాస్టర్ మీదా.? కక్ష వెనుక కారణమేంటి.?
ఔను, జనసేన పార్టీ తరఫున జానీ మాస్టర్ యాక్టివ్‌గా వుండడం, ఓ స్టార్ హీరోకి నచ్చలేదు.! సదరు స్టార్ హీరో కూడా జనసేన పార్టీతో పరోక్షంగా సంబంధం వున్నోడే.!
Also Read: గేమ్ ఛేంజర్.! 90 నిమిషాలు.. మూడు భాషల్లో.!
కాకపోతే, కుంపటి మార్చాడు.. మొన్నటి ఎన్నికల్లో.! నక్క వేషాలు వేయడంలో సిద్ధహస్తుడాయన.! ఆయనే, జానీ మాస్టర్‌కి వ్యతిరేకంగా దిక్కుమాలిన మీడియాలో నెగెటివ్ వార్తలు రాయించాడన్న అనుమానాలూ లేకపోలేదు.
జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.! తప్పు చేయకపోతే.. అతన్ని ఇంతలా బాధపెట్టినవారికి అంతకు మించిన శిక్ష పడి తీరాల్సిందే.!