Table of Contents
యుద్ధం (India Pakistan War) చేయడం ఎటూ చేత కాలేదు. కనీసం అబద్ధాలైనా సరిగ్గా చెప్పాలి కదా. అబద్ధాలు చెప్పడంలో పాకిస్థాన్ (Pakistan)దిట్ట అయినా ఆ అబద్ధాల్లో కూడా డొల్లతనమే. మరోసారి పాకిస్థాన్ అబద్ధాల ప్రసహనం తుస్సుమంది. ముగ్గురు భారత్ పైలట్లను పట్టుకున్నామనీ, రెండు భారత యుద్ద విమానాల్ని కూల్చేశామని పాకిస్థాన్ ప్రకటించుకుంది. ఇందులో సగం మాత్రమే వాస్తవం.
భారత్‌కి చెందిన మిగ్ 21 బైసన్ (Mig 21 Bison) యుద్ధ విమానం కూలిపోయింది. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్‌లో ల్యాండ్ అయ్యాడు. అతన్ని పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కాస్త వెనక్కి వెళితే, పుల్వామా టెర్రర్ ఎటాక్ తర్వాత పాకిస్థాన్‌కి గట్టి సమాధానం చెప్పాలనే కసితో భారత ప్రభుత్వం వైమానిక దళాన్ని రంగంలోకి దించింది.
పాక్ భరతం పట్టిన మిరాజ్ (India Pakistan War)
వైమానిక దళం తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసింది. 21 నిముషాల్లో 12 మిరాజ్ (Mirage 2000) యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోకి చొచ్చుకువెళ్లి అక్కడి తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో ఎంతమంది చచ్చిపోయారన్నది పాకిస్థాన్‌కే తెలియాలి. కానీ ఇలాంటి విషయాల్లో పాకిస్థాన్ ఎప్పుడూ వాస్తవాల్ని ఒప్పుకోదు. తీవ్రవాదుల్ని తమ మిలిటరీ సహాయంతో భారత్‌లోకి పంపి విధ్వంసాలు సృష్టించాయి.
పాకిస్థాన్‌కి ఇది మా ఘనత అని చెప్పుకునేంత ధైర్యం లేదు. పాకిస్థాన్ అంటే బూటకం. అలాంటి పాకిస్థాన్ నిజాల్ని ఒప్పుకుంటుందని ఎలా ఆశించగలం.? అత్యంత ఖరీదైన యుద్ధ విమానాన్ని కోల్పోయిన పాకిస్థాన్, అలాంటిదేం జరగలేదంటూ బుకాయించింది. నిజమేంటో భారత వాయుసేన ఆధారాలతో సహా నిరూపించింది.
పుల్వామా పైత్యానికి చెంప దెబ్బ..
పాకిస్థాన్‌కి ఎఫ్ 16 (F16 Figher Air Craft) యుద్ధ విమానం ఎంత విలువైనదో ప్రపంచానికి తెలుసు. మన మిరాజ్ యుద్ధ విమానంతో అది సమానం. కానీ అంతకుమించి ఎన్నో రెట్లు శక్తివంతమైన యుద్ధ విమానాలు భారత్ వద్ద చాలా ఉన్నాయి. భారత్ కనుక పుల్వామా దాడి ఘటనను ఇంకాస్త సీరియస్‌గా తీసుకుని ఉంటే, ప్రపంచ పటంలోంచి పాకిస్థాన్ అనే పేరు శాశ్వతంగా చెరిగిపోయేది.
కానీ శత్రువుకి బుద్ధి చెప్పాలన్న ఆలోచన తప్ప, శత్రువును నాశనం చేయాలని ఆలోచించదు భారతదేశం. మన సహనాన్ని చేతకానితనంగా భావించడం పాకిస్థాన్ అవివేకానికి నిదర్శనం. పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితేంటో ప్రపంచానికి తెలుసు. రెండు మూడు రోజులు ఏకధాటిగా భారత్‌తో యుద్ధం చేసేంత శక్తి లేదు పాకిస్థాన్‌కి.
పాకిస్తాన్ బతుకెంత? (India Pakistan War)
ఆర్ధికంగా కావచ్చు, సైనిక పాఠవంగా కావచ్చు, పాకిస్థాన్, జస్ట్ నథింగ్ భారత్ దృష్టిలో. అందుకే పాకిస్థాన్ ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడదు. యుద్ధం చేయడం చేతకానోడే, దొంగ దారులు వెతుక్కుంటాడు. పాకిస్థాన్ చేస్తున్నది అదే. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, భారత్ ప్రధాని నరేంద్రమోడీతో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. భారత ప్రధాని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఈ విషయాన్ని స్వయంగా ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ పార్లమెంట్‌లో చెప్పాడంటే, ఎంతటి దౌర్భాగ్య స్థితిలో పాకిస్థాన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాకిస్థాన్ చెరలో ఉన్న వింగ్ కమాండర్‌ని రప్పించుకోవడం భారత్‌కి పెద్ద పనేమీ కాదు, అది తెలిసే, కాళ్ల బేరానికొచ్చి, వింగ్ కమాండర్‌ని అప్పగిస్తామని పాక్ ప్రధాని ప్రకటించాడు.
ఇమ్రాన్ ఖాన్ – వేరే గతిలేక.. (India Pakistan War)
గతిలేక, వింగ్ కమాండర్ అభినందన్ (Wing Commander Abhinandan)ని భారతదేశానికి అప్పగించింది పాకిస్తాన్. యుద్ధం వద్దు.. అని భారత ప్రజానీకం, పాకిస్థాన్ ప్రజానీకం కోరుకుంటోంది. దురదృష్టవశాత్తూ పాకిస్థాన్‌లో కొందరు మాత్రం భారత్ మీద విద్వేషం వెదజల్లుతూనే ఉన్నారు.
కాలం చెల్లిన మిగ్ 21తో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వద్దనున్న అత్యాధునిక ఎఫ్16ని నేలకూల్చడమంటే మాటలు కాదు. ఇది భారత వింగ్ కమాండర్ ప్రతిభ. అదే సుఖోయ్ యుద్ధ విమానాన్ని వినియోగించి వుంటే, పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరమే అయ్యేది.
తమ శక్తి తెలిసి భారత్ మీద ఒకటికి రెండు సార్లు దాడికి యత్నించి, చేతులు కాల్చుకుని, చివరికి కాళ్ల బేరానికి వచ్చి తోక ముడవడం పాకిస్థాన్‌కి అలవాటే. అది ఇంకోసారి నిరూపితమైంది.