ఆమె అవివాహితురాలు. కానీ, చాలామందికి ఆమె అమ్మ.! ఔను, తమిళనాడులో కొన్ని కోట్ల మందికి ఆమె (Jayalalitha) ఆరాధ్య దైవం.
సినీ నటిగానే కాదు, రాజకీయ నాయకురాలిగా.. ముఖ్యమంత్రిగా.. ఓ పార్టీ అధినేత్రిగా.. జయలలిత సాధించిన విజయాలు.. సంపాదించుకున్న ఫాలోయింగ్.. న భూతో న భవిష్యతి.!
రాజకీయాల్లో తిరుగులేని విజయాలు ఆమె సొంతం. అలాగే, ఆమె ఎన్నో అవమానాల్ని కూడా రాజకీయాల్లో ఎదుర్కొన్నారు.
Jayalalitha జయలలిత అంటే ఫైటర్..
ఔను, జయలలిత అంటే ఓ ఫైటర్. కానీ, ఆమె చివరి రోజులు అత్యంత దయనీయంగా గడిచాయి. చివరి రోజుల్లో జయలలిత ఏం చేశారు.? ఆమె ఎలా వున్నారు.? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.!
ఒక రోజు కాదు, రెండ్రోజులు కాదు.. దాదాపు డెబ్భయ్ నాలుగు రోజులపాటు జయలలిత ఆసుపత్రికే పరిమితమైపోయారు.
అసలు జయలలిత ఎలా వున్నారో సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేదే కాదు. వైద్యులు మెడికల్ బులెటిన్లు విడుదల చేయడం, ప్రముఖులు పరామర్శించి రావడం.. అంతే.!
అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరి..
జయలలిత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. జయలలితపైవ విష ప్రయోగం జరిగిందనీ.. ఇంకోటనీ.. బోల్డన్ని అనుమానాలున్నాయ్.
మిస్టరీ వీడేదెప్పుడు.? జయలలిత మరణంపై ఓ కమిటీ ఏర్పాటయ్యింది. ఆ కమిటీ ఏదో నివేదిక ఇచ్చింది. కానీ, వాస్తవంగా జరిగిందేంటి.? అన్నది మాత్రం ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.
Also Read: అద్దె గర్భం.! నయనతారపైనే ఎందుకింత దుమారం.?
ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే ఆమె తుది శ్వాస విడిచారు. ఓ ముఖ్యమంత్రి మరణం విషయమై ఇంత సీక్రెసీనా.? దేశం ముందుకు వెళుతోందా.? వెనక్కి వెళుతోందా.?
కోట్లాది మంది అభిమానులు.. వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు.. కానీ, చివరి రోజుల్లో అత్యంత విషాదకరమైన పరిస్థితి.
జయలలిత మీద సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటున్నారు.. జయలలిత ఫొటోలతో రాజకీయంగా ఎదుగుతున్నారు. కానీ, జయలలిత డెత్ మిస్టరీ వీడటంలేదు.! ఎప్పటికీ ఆ మిస్టరీ వీడదు కూడా.!