Table of Contents
Jr NTR Nannevaru Aapaleru.. జూనియర్ ఎన్టీయార్ కొత్త సినిమా ‘వార్-2’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. జూ. ఎన్టీయార్, హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా ఈ ‘వార్-2’.
ఈ ‘వార్-2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీయార్, తన అభిమానుల్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆ వ్యాఖ్యలిప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అసలు, ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జూనియర్ ఎన్టీయార్, ‘ఎమోషనల్ కనెక్ట్’ కోసం ఎందుకు వాడుకున్నట్లు.?
Jr NTR Nannevaru Aapaleru.. ఎక్కడ తేడా కొట్టింది చెప్మా.?
‘మైక్ ఇచ్చేసి వెళ్ళిపోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. వెళ్ళిపోనా.?’ అంటూ, అభిమానుల్ని ఉద్దేశించి కసురుకున్నాడు జూనియర్ ఎన్టీయార్.
సాధారణంగా సినీ వేడుకల్లో అభిమానుల అత్యుత్సాహం వేరే లెవల్‌లో వుంటుంది. అదే, స్టార్స్‌కి ‘హై’ ఇస్తుంటుంది కూడా.!

కొన్ని సందర్భాల్లో, అభిమానుల అత్యుత్సాహం ఆయా హీరోలకి ఒకింత ఇబ్బందికరంగా మారుతుందనుకోండి.. అది వేరే సంగతి.
అయినాగానీ, అభిమానుల్ని కసురుకోవడం సబబేనా.? ప్చ్, అస్సలు కాదు. కానీ, జూనియర్ ఎన్టీయార్ ఎందుకు సంయమనం కోల్పోయినట్లు.?
ఆపుతున్నదెవరు ఎన్టీయారూ.!
‘నన్నెవరూ ఆపలేరు’ అంటూ జూనియర్ ఎన్టీయార్, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. ఇదిప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోన్న అంశంగా మారింది.
అసలంటూ, జూనియర్ ఎన్టీయార్‌ని ఆపే అవసరం ఎవరికి వుంది.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. సినీ ప్రముఖులకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలే.
అందరు హీరోలూ ఎదుర్కొంటున్నట్లే, జూనియర్ ఎన్టీయార్ కూడా ట్రోలింగ్‌ని ఎదుర్కొంటున్నాడు. అతని అభిమానులు, ఇతర హీరోల్ని ట్రోల్ చేస్తున్నారు కదా.. ఇదీ అలాంటిదే.
కొందరు రాజకీయ నాయకులు, జూనియర్ ఎన్టీయార్‌ని టార్గెట్ చేయడం చూశాం. ఇంతకు మించిన ఇబ్బంది, పవన్ కళ్యాణ్‌కి ఎదురవుతుండడం తెలిసిన విషయమే.
పవన్ కళ్యాణ్ వ్యవహారం వేరు..
పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా అడ్డుకునేందుకు, అతని సినిమాల్ని టార్గెట్ చేసింది ఓ పార్టీ, ఆ పార్టీ హయాంలో నడిచిన ప్రభుత్వం. అందుకే, ‘మనల్ని ఎవడ్రాా ఆపేది.?’ అనే డైలాగ్ పేల్చుతుంటారు పవన్ కళ్యాణ్.
కానీ, జూనియర్ ఎన్టీయార్‌కి అలాంటి థ్రెట్స్ ఏమీ లేవు కదా.? అసలు, జూనియర్ ఎన్టీయార్‌ని ఆపే ప్రయత్నమూ ఎవరూ చేయడంలేదు కదా.!
Also Read: ’ఉప్పు కప్పురంబు‘ రివ్యూ: పురుషులందు పుణ్య పురుషులెవరయ్యా.!
అన్నట్టు, బాబాయ్ బాలయ్య పేరుని ప్రస్తావించేందుకు జూనియర్ ఎన్టీయార్ ఇష్టపడలేదు ఈసారి.. అదీ, ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.
దాంతో, బాలయ్య అభిమానులు హర్టయ్యారు. ‘విశ్వాసం లేని డాష్’ అంటూ, జూ ఎన్టీయార్‌ని తిడుతున్నారు. కావాలనే, బాలయ్యని వివాదాల్లోకి జూనియర్ ఎన్టీయార్ లాగాడన్నది వారి వాదన.
ఎవరి గోల వారిది. ఇది సోషల్ మీడియా యుగం. ఎవర్నీ ఆపలేం. ట్రోలింగ్ నడుస్తూనే వుంటుంది.
‘నన్నెవరూ ఆపలేరు’ అనే మాట జూనియర్ ఎన్టీయార్ కావాలనే అన్నాడా.? అన్నదే అసలు ప్రశ్న ఇక్కడ.