JrNTR Simhadri 4k.. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘సింహాద్రి’ మళ్ళీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్‌ల ట్రెండ్ అనూహ్యంగా కనిపిస్తోంది. జనసేన పార్టీకి నిధులను సమకూర్చే క్రమంలో ఇటీవల ‘ఆరెంజ్’ సినిమాని విడుదల చేశారు.
గతంలో కూడా, ఛారిటీ కార్యక్రమాల నిమిత్తం.. పలు సూపర్ హిట్ సినిమాల్ని రీ-రిలీజ్ చేశారు. అభిమానుల్లో ఆయా సినిమాలు కొత్త ఉత్సాహం నింపడం మామూలే.
అదే సమయంలో, ఛారిటీ కార్యక్రమాల ద్వారా అభిమానులకు మంచి పేరు కూడా వస్తుంది గనుక, ఈ రి-రిలీజ్ వ్యవహారాల్ని తప్పు పట్టలేం.
JrNTR Simhadri 4k.. అభిమానుల సహాయార్థం..
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఎన్టీయార్, భూమిక (Bhumika Chawla), అంకిత కలిసి నటించిన ‘సింహాద్రి’ (jr NTR Simhadri) సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.
ఆ సినిమాని రీ-రిలీజ్ చేయాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. థర్డ్ పార్టీ నుంచి సినిమాని రైట్స్ కొనుగోలు చేశారు. రీ-రిలీజ్ ద్వారా వచ్చే వసూళ్ళను, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న అభిమానులకు అందిస్తారట.

ఓ మంచి కార్యక్రమం గనుక, దీన్ని అభినందించి తీరాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీయార్ (Global Star NTR) కూడా ఈ విషయంలో అభిమానులను ఉద్దేశించి ‘గో ఎహెడ్’ అన్నారట.
అయితే, ఛారిటీ కోసం వేరే మార్గాలున్నప్పుడు, కేవలం సినీ ప్రదర్శన మాత్రమే ఎందుకు.? జూనియర్ ఎన్టీయార్‌ని అడిగితే.. ఓ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తే.. ఆయన కాదంటాడా.?
Also Read: Ravanasura First Report: రవితేజ ఈసారి హిట్టా.? ఫట్టా.?
కేవలం ఎన్టీయార్ (Man Of Masses NTR) సినిమా విషయంలోనే కాదు, ఇతర హీరోల సినిమాల విషయంలోనూ ఇదే డౌటానుమానం కలుగుతోంది చాలామందికి.
పాత సినిమాల్ని మళ్ళీ థియేటర్లలో చూసి అభిమానులు ఉర్రూతలూగడం మామూలే. అయితే, అది అభిమానుల జేబులకు చిల్లులు వేస్తోందన్నది నిర్వివాదాంశం.
అభిమానుల ఎమోషన్స్‌తో ఇలా ఆటలాడటం తగునా.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు.? హీరోల అభిమానులే కాదు, హీరోలు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.