JSP TDP BJP AP.. ఎట్టకేలకు మూడు పార్టీలూ ఒక్కటయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో, బీజేపీ – తెలుగు దేశం పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయి.
జనసేన – టీడీపీ – బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ఈ పొత్తు పరిమితమవుతుందా.? తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది.
పొత్తు కుదరడం ఓ యెత్తు.. పొత్తులో వున్న పార్టీల మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ సజావుగా సాగడం ఇంకో యెత్తు.!
JSP TDP BJP AP.. ఆలస్యం అమృతం..
ఆలస్యమయ్యే కొద్దీ కింది స్థాయిలో మూడు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. నిజానికి, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది కూడా.
టీడీపీ – జనసేన – బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.! దీనికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టగలగాలి ఆయా పార్టీలు.
ఈ రోజుల్లో సోషల్ మీడియాని తేలిగ్గా తీసి పారేయలేం. అది చేసే నష్టం చాలా చాలా ఎక్కువ. దాని వల్ల లాభం చాలా చాలా తక్కువ.
నష్ట నివారణకు అయినాగానీ, సోషల్ మీడియాని ఆయా పార్టీలు జాగ్రత్తగా వాడాల్సి వుంటుంది.
ఆ ముగ్గురూ ఒకే వేదికపై..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురూ ఒకే వేదికపై ఎప్పుడు కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రత్యేక హోదా సహా విభజన హామీల ప్రస్తావన ఆ వేదికపై వస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
Also Read; ‘పులుసు పాప’ అనేశావేంటి ‘బ్లేడు బాబ్జీ’.!
ముందైతే, ముగ్గురూ కలిసింది వైసీపీని గద్దె దించడానికే.! ఆ దిశగా మూడు పార్టీల కార్యాచరణ ‘పద్ధతిగా’ వుండాల్సి వుంది.
‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని దాదాపు మూడేళ్ళ క్రితం ప్రకటించిన జనసేనాని, అప్పటినుంచి ఇప్పటివరకు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. మూడు పార్టీల్నీ ఒక్కతాటిపైకి తీసుకురాగలిగారు.
మూడు కలవడం గొప్ప కాదు.. సీట్ల పంపకాలు, ఓటు ట్రాన్స్‌ఫర్.. ఇవీ అసలు సిసలు అంశాలు.! మరి, ఆ విషయమై మూడు పార్టీలూ ఎలా కలిసి పని చేస్తాయో వేచి చూడాల్సిందే.