ఇప్పుడు ‘ఆ టైపు‘ సినిమాలు తియ్యగలవా వర్మా.!

RGV YSRCP Flop Show.. సినిమా అనేది కళాత్మక వ్యాపారం.! ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.

ఏం లాభం.? ఎంత ఎత్తుకు ఎదిగాడో.. అంతకు మించి దిగజారిపోయాడు.. అదీ అదఃపాతాళానికి.

‘అంతా నా ఇష్టం..’ అనే పిచ్చిలో పడిపోయి, దానికి ‘పగ, ప్రతీకారాలు’ తోడై, రామ్ గోపాల్ అత్యంత జుగుప్సాకరంగా తయారయ్యాడు.

వైసీపీకి తొత్తుగా మారి, పలు సినిమాల్ని తెరకెక్కించాడు.. అవి కూడా పవన్ కళ్యాణ్ మీదా, చంద్రబాబు మీదా సెటైరికల్‌గా.

RGV YSRCP Flop Show.. ఏం సాధించావ్ వర్మా.?

ఆయా సినిమాలతో వర్మ ఏం సాధించినట్లు.? ప్చ్.. ఏమీ లేదు, జస్ట్ పైశాచికానందం తప్ప. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిశాక, ‘ఇకపై రాజకీయ పరమైన సినిమాలకు దూరంగా వుంటాను’ అని ప్రకటించేశాడు.

వెటకారం అనేది పనికిమాలినతనం.. అదేదో తనకు మాత్రమే చేతనైన ఘనత.. అనుకుంటే, రామ్ గోపాల్ వర్మలా నవ్వులపాలవడమే.!

Mudra369

ఈమాత్రందానికి ‘నేనెవరికీ భయపడను.. అంతా నా ఇష్టం..’ లాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వడమెందుకు.?

అయినా, వర్మ అనేటోడు మాట మీద నిలబడే రకం కాదు.! ఎవరన్నా ఎంగిలి మెతుకులు పారేస్తే చాలు, వాళ్ళ కోసం మళ్ళీ దిక్కుమాలిన సినిమాలు తీసేస్తాడన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.

వర్మ సినిమా అంటే.. బోడి గుండే.!

చివరగా.. వర్మ (Ram Gopal Varma) సినిమాలు థియేటర్లలో ఆడే పరిస్థితి వుండదు. రిలీజ్ ఖర్చులు కూడా రావు. ఓటీటీ సంగతి సరే సరి.!

ఇప్పుడు వర్మ గనుక మళ్ళీ రాజకీయ నేపథ్యంలో సెటైరికల్ సినిమాలు తీస్తే, వాటిని వైసీపీ మద్దతుదారులు కూడా చూసే పరిస్థితి వుండదు.

Also Read: ఏంది సామీ! నేషనల్ క్రష్ రష్మికకే అంత సీన్ లేదంటారా?

అయినా, పోయి పోయి వర్మతో ఇప్పుడు ఆ తరహా సినిమాలు తీసేంత తలకి మాసిన వెధవతనం ఎవరికి వుంటుంది చెప్మా.? అన్నది ఇండస్ట్రీ టాక్.!

hellomudra

Related post