Justice For Koratala Siva.. సోషల్ మీడియాలో పిచ్చి వేషాలేస్తే సరిపోతుందా.? ఊరికినే వచ్చే ట్విట్టరులో కూతలు కూస్తే దాని వల్ల లాభమేంటి.?
‘ఆచార్య’ సినిమాతో నిర్మాతకు వచ్చిన నష్టమెంతో తెలియదు.? దర్శకుడు ఎలాంటి రెస్పాన్సిబులిటీ సినిమా విడుదలకు ముందు తీసుకున్నాడో తెలియదు.
ఈ మొత్తం వ్యవహారంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), ఆయన తనయుడు రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఏం చేస్తున్నాడన్నదానిపైనా సరైన అవగాహన వుండదు.
కానీ, ట్విట్టర్‌లో కారుకూతలు కూసెయ్యడానికి చాలామంది అత్యుత్సాహం చూపేస్తున్నారు.
నిర్మాణ సంస్థ మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్, ‘ఆచార్య’ సినిమాతో నష్టపోయినట్లు చెప్పలేదు. మరెందుకీ రచ్చ.? నిజమే, ‘ఆచార్య’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగితే, సినిమా అనూహ్యంగా పరాజయం పాలైంది. నష్టాలెంత.? అన్నదానిపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత.. కలిసి కూర్చుని, మాట్లాడుకుంటారు. అది సహజంగానే జరిగే వ్యవహారం.
Justice For Koratala Siva.. కానీ, కొరటాల కథ వేరు.!
తన సినిమాల విషయంలో కొరటాల శివ తనదైన స్ట్రాటజీలు అమలు చేస్తుంటాడు. దర్శకుడే అయినా, నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటాడు. పంపిణీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు.
ఆ మాటకొస్తే, తన స్నేహితుల్నే పంపిణీదారులుగా పెట్టుకోవడం కొరటాల శివకి అలవాటే. లాభాల్లో వాటాలెలా తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు.

సో, ‘ఆచార్య’ (Acharya Movie) విషయంలో కీలక బాధ్యతలు కొరటాల శివ తీసుకోవాల్సి వుంటుంది.. తీసుకుంటాడు కూడా.
మెగాస్టార్‌ది తప్పించుకునే మనస్త్తత్వం కాదు.!
150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి, ఉత్తుత్తినే మెగాస్టార్ అయిపోలేదు. ఈ క్రమంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో పరాజయాల్ని చవిచూశారు.. ఎన్నెన్నో సంచలన విజయాల్నీ అందుకున్నారు చిరంజీవి.
ఏ రోజూ, ఏ నిర్మాతా చిరంజీవి సినిమాల వల్ల నష్టపోయినట్లు ఇప్పటిదాకా చెప్పిన దాఖలాల్లేవు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సైతం చిరంజీవి పట్ల అమితమైన అభిమానాన్నే కలిగి వుంటారు.
Also Read: నాగచైతన్య ‘థాంక్యూ’: అమ్మ, నాన్న.. హష్.!
‘ఆచార్య’ సినిమాకి చిరంజీవితోపాటు చరణ్ కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని కొరటాల శివ గతంలోనే చెప్పాక, ఈ వివాదంలోకి మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ని ఎందుకు లాగుతున్నట్టు.?
నిజానికి, చాలామంది హీరోల సినిమాలు హిట్టయినా, నిర్మాతలు నష్టపోతుంటారు. అలాంటి హీరోల వెర్రి అభిమానులే.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మీద సోషల్ మీడియాలో పడి ఏడుస్తున్నారు. అదీ అసలు సంగతి.
ట్వీటుకి రూపాయో, రెండ్రూపాయలో వస్తాయని కక్కుర్తి పడే బ్యాచ్ చేస్తోన్న ట్రెండింగ్ వ్వయహారం ‘జస్టిస్ ఫర్ కొరటాల’. ఎనీ డౌట్స్.?