Jyothi Rai Pretty Girl.. ఎవరీ జ్యోతీ రాయ్.? ఎవరీ జ్యోతి పూర్వజ్.? ఎవరీ జయశ్రీ రాయ్ కెకె.? పేర్లు మూడు.. కానీ, ఆమె ఒక్కరే.! ప్రెట్టీ గర్ల్ జ్యోతి రాయ్.!
తెలుగు బుల్లితెర వీక్షకులకు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా సుపరిచితురాలైన నటి జ్యోతి రాయ్ గురించే ఇదంతా.!
కన్నడ టీవీ పరిశ్రమలోనూ జ్యోతి రాయ్ బాగానే పాపులర్. నిజానికి, ఆమె కన్నడ నటి. తెలుగు తెరపైనా తనదైన ప్రత్యేకత చాటుకుంది.

అన్నట్టు, ఈ బ్యూటీ ‘దేవర’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది.
Jyothi Rai Pretty Girl. సంగతేంటంటే..
జ్యోతి రాయ్, ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నిర్మాణ దశలో వుంది.
వెబ్ సిరీస్ ఎలా వుండబోతోందో.. ఆ ఫస్ట్ లుక్‌తోనే అర్థమయిపోయింది. ఔట్ అండ్ ఔట్ హాట్ కంటెంట్ అందులో నింపేస్తారేమో.!

ఇక, సోషల్ మీడియాలో అయితే, జ్యోతి రాయ్ అలియాస్ జయశ్రీ రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ ఫొటోలకు బీభత్సమైన క్రేజ్ వుందండోయ్.!
చూస్తున్నారు కదా.. ఇదీ జ్యోతి గ్లామర్ ట్రీట్.! ఎవరికి ఎప్పుడు ఎలా పాపులారిటీ వస్తుందో చెప్పలేం.! జ్యోతి రాయ్‌కి ఇదిగో ఇలాంటి గ్లామరస్ ఫొటోలతో ఆ పాపులారిటీ వచ్చింది మరి.!