K Viswanath Kala Tapaswi.. గొప్ప దర్శకుడని అనాలా.? మంచి నటుడని అనాలా.? ఉత్తమ గురువు అనాలా.? ‘కళాతపస్వి’ కంటే గొప్ప పదం ఇంకేమైనా వుంటుందా ఆయన గురించి గొప్పగా చెప్పడానికి.?
‘కళా తపస్వి’.. కె. విశ్వనాథ్.. ఈ పేరు చాలు.. ఆయన సినిమాల్లో నటించిన నటీనటులకే కాదు.. ఆ సినిమాలు చూసినవాళ్ళకి కూడా ఓ అందమైన అనుభూతి ఎప్పుడూ కలుగుతుంటుంది.
ఆయన చేసిన సినిమాలు అలాంటివి. కాదు కాదు, ఆయన అందించిన ‘చిత్ర రాజములు’ అలాంటివి.!
K Viswanath Kala Tapaswi సినిమాలు కాదు.. జీవితాలు.!
కె.విశ్వనాథ్ సినిమాల్లో జీవితాలు కనిపిస్తాయి. అందుకే, కె.విశ్వనాథ్ సినిమాలు తీశారు.. అనే కంటే, ఆయన ‘మంచి సినిమాలు’ అందించారు అంటారు. ‘జీవితాల్ని ఆశిష్కరించారు’ అని చెబుతుంటారు.
కొందరు దర్శకులు ‘స్టార్స్’ని తయారు చేస్తారు.!
కొందరు మాత్రమే అలాంటి ‘స్టార్స్’ని నటులుగా తీర్చిదిద్దుతారు.
అలాంటి అరుదైన దర్శకుల్లో..
మరింత అరుదైన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు..
Mudra369
అగ్ర నటీనటులు సైతం, ‘ఆయన సినిమాల్లో చిన్న వేషం దొరికినా చాలు’ అని ఎగబడేవారు. అదీ కె.విశ్వనాథ్ అంటే.
నిజానికి, కె.విశ్వనాథ్‌ని దర్శకుడిగా కంటే కూడా గురువుగా ఎక్కువమంది అభిమానిస్తారు, ఆరాధిస్తారు.
ఆయన లేరు.. ఆయన చిత్రాలుంటాయ్..
ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది.. కానీ, కళాతపస్వి విశ్వనాథ్ సినిమాలు ఏ ట్రెండ్‌లో అయినా బోర్ కొట్టవు. అదీ ఆయన ప్రత్యేకత.
గొప్ప గొప్ప సినిమాలు అరుదుగా వస్తుంటాయ్.. వెళుతుంటాయ్.. కళాతపస్వి సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయ్.!
ప్రతి పాత్రా.. ప్రతి సన్నివేశం.. ప్రతి మాటా.. గుండె లోతుల్లోంచి ఎప్పటకప్పుడు మనల్ని తడుతూనే వుంటాయ్. దటీజ్ కళాతపస్వి.!
నరుడి బతుకు నటన..
ఈశ్వరుడి తలపు ఘటన..
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన !!
సినీ తపస్సు..
సినిమాలకు సంబంధించి ఆయన తపస్సు చేశారు. అందుకే, ఓ యోగిలా సినిమాలు చేశారు.. వెండితెరపై ఎన్నో జీవితాల్ని ఆవిష్కరించారు.
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
జివితాలనే అనాలి.! ఆయా పాత్రల జీవితాలవి. ఆ కళా తపస్వి ఇక లేరు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇది మహాభినిష్క్రమణం.!
– yeSBee